Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మన్న : అబ్బీ!

కొమ్మన్న : అటు తిరుగు - బ్రహ్మన్న దొర పిలుస్తున్నారు.

పాములవాడు : (అమాయకంగా) ఏంది దొరా! పలనాటి కిట్టయ్య ఆయెనేనా దొరా! ఓ కిట్టయ్య దొరో, దణ్ణము సామో! ఓ బెమ్మయ్య దొరో, దణ్ణము సామో!!

బ్రహ్మన్న : (ప్రతిగా నమస్కరించి) అబ్బీ, పాము నువ్వు చెప్పినట్టు వింటుందా?

పాములవాడు : (చెముడు వల్ల వినపడక పెద్దగొంతుకతో) నాది బురదమట్ట కాదు దొరా!

బ్రహ్మన్న : అయితే మరేమిటి?

పాములవాడు : నాగమదొరా... నాగమ

బ్రహ్మన్న : (సాలోచనుడై) ఉం.... నీ పేరు?

పాములవాడు : (చెవి రిక్కించి) నాగమదొరా... నాగమ

కొమ్మన్న : దొర నీ పేరే మంటున్నారురా!

పాములవాడు : నా పేరా? కాముడు దొరా!

బ్రహ్మన్న : (పామును చూపిస్తూ) ఇది నీకెక్కడ దొరికింది?

పాములవాడు : వనమూలికలకు పోతే ఎత్తిపోతల అడవుల్లో దొరికింది దొరా!

బ్రహ్మన్న : (సాభిప్రాయంగా తల పంకిస్తూ) ఓహో, అయితే దాన్ని కాసేపు ఆడించు.

పాములవాడు : అదే నన్నాడిత్తది దొరా!... సెప్పినట్టిందు.

బ్రహ్మన్న : చెప్పినట్టు కూడా విందూ?

కొమ్మన్న : అది నీ మాట విని ఆడకపోతే ఊళ్లో నీకు ముష్టి ఎవరు పెడతారురా?

పాములవాడు : ఒకొప్పుడు అదే నన్నాడిత్తది. తను ఆడుద్ది. మా ఆట అప్పుడు సూసిన్నోళ్ళు ఊరికే డబ్బు కురిపిత్తరు దొరా!

బ్రహ్మన్న : (మెడలో చిన్న హారం తీసి సేవకుడితో) ఇది వాడికిచ్చి పంపించు. (సేవకుడు ముందుకు వచ్చి హారం కళ్ళ కద్దుకొని వాడికిచ్చి) అబ్బీ, లే.


18

వావిలాల సోమయాజులు సాహిత్యం-2