Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వసంతసేన : ఆర్యా! ఏదో పనిబడి వచ్చినట్లున్నారు లేకపోతే ఎన్నడూ మా గడపలే తొక్కనివారు... మైత్రేయుడు : (అటూ ఇటూ చూచి) ఈ అమ్మాయి, మీ చెల్లెలు మదనిక కదూ! వసంతసేన : మీరు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. మైత్రేయుడు : అమ్మాయీ! ఆనాడు కామాలయం నుంచీ తిరిగి వచ్చేటప్పుడు చారుదత్తుడి ఇంట్లో దాచిపెట్టమని నగల పాత్ర ఒకటి ఉంచిపోయినావు. వసంతసేన : అవును! జ్ఞాపకమున్నది. మీరు 'మన ఇంట్లో దాచనిచ్చిన దీన్ని' అని చమత్కరించారు, దానికి మీ మిత్రులు 'వెంటనే ఆమె కోరినప్పుడు తిరిగి ఇచ్చివేయా'లని సమాధానం కూడా చెప్పారు - అదేనా? మైత్రేయుడు : అదే! అది తనదే ననే భ్రాంతితో. మదనిక: (దగ్గరకు వస్తూ) ఆఁ. మైత్రేయుడు : మిత్రబృందంతో జూదమాడి మా చారుదత్తుడు ఓడి పోయినాడు. మదనిక : వసంతసేన (ఒకరిమొగం ఒకరు చూచి నవ్వుకుంటారు). మైత్రేయుడు : (మొగాలు చూస్తూ రత్నావళి బయటికి తీస్తూ) దానికి మారుగా ఈ రత్నహారం గ్రహిస్తావేమో అడిగి రమ్మని నన్ను పంపించాడు. వసంతసేన : వారి ఔదార్యం లోకంలో పూర్వమెన్నడూ విన్నదేకాదు! మైత్రేయుడు : రత్నహారం తీసుకోవటం నీకేమీ ఇష్టంలేనట్లున్న దమ్మాయీ! వసంతసేన అనురాగపూర్వకంగా మీ మిత్రులు పంపించిన హారాన్ని స్వీకరించకపోవటం మహాపచారం. మైత్రేయుడు : ఆఁ, ఇందులో అపచారానికేమున్నదీ, విచారానికేమున్నది. వసంతసేన : మదనికా! - (ఆ హారాన్ని అందుకోమన్నట్లు సంజ్ఞ చేస్తున్నది). మదనిక: (చేయి చాపుతుంది). మైత్రేయుడు : (ఇవ్వలేక ఇవ్వలేక ఇస్తూ) ఇది స్వర్గీయులైన మా అక్క ధూతాదేవిగారికి పుట్టింటివారు సూడిదగా ఇచ్చింది. 162 వావిలాల సోమయాజులు సాహిత్యం-2