Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోసుకుంటాను. అదీ పుట్టదనుకో, ఉప్పునీళ్ళే పోసుకుంటాను. సరే, నీవు పద. నేను ఇక్కడున్నట్లుగా వస్తాను.

రదనిక: బాగా ఎండపడ్డది. ఇప్పుడెందుకు వృథా ప్రయాస.

మైత్రేయుడు : దొరకవూ? ఎందుకు దొరకవూ? ఏ కొంపకైనా కన్నంవేసి తీసుకోవస్తాను గాని వట్టిచేతులతో చారుదత్తుడి గుమ్మం తొక్కుతానా! అక్కయ్యగారడిగితే ఇప్పుడే వస్తున్నాని చెప్పు - ఉఁ

రదనిక : (నిష్క్రమిస్తుంది)

మైత్రేయుడు : (క్రింది వేదపన్నం చెప్పుకుంటూ)

"భృగుర్వై వారుణిః వరుణం పితర ముపససార, అధీహి భగవో బ్రహ్మేతి, తస్మా ఏతత్ ప్రోవాచ, అన్నం ప్రాణం, శ్రోత్రం మనో వాచా మితి”

(నిష్క్రమిస్తాడు)

—————————————————————————————

132

వావిలాల సోమయాజులు సాహిత్యం-2