Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/850

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వచ్చిం దెవరని అడిగితె
లక్ష్మి పరాకుగ ఉండుట
ఎట్టి సమాధానమ్మును
చెప్పలేదు. విష్ణువు కో
పించి నీవు యమునా తమ
సా సంగమ క్షేత్రమైన
'సువర్ణాక్ష' క్షేత్రంలో
బడబవుగా పుట్టుమంటు
శాపమిచ్చినాడు. బడబ[1]
వోలె పుట్టి లక్ష్మి అచట
'పతిని తిరిగి ఎలా చేరు
కొనగలనా?' అని శివుణ్ణి
గూర్చి తపము చేసింది.
బడబకు ప్రత్యక్షమయ్యె
పరమేశుడు "నీభర్తను
నీతో చేరుస్తా" నని
గట్టిమాట ఇచ్చినాడు.
చిత్రరూపు డను దూతను
శివుడు విష్ణుకడకు పంపె.
ఈ హేతువుచే విష్ణువు
అశ్వరూపమును ధరించి
లక్ష్మీ బడబను కలిసెను
ఇది దేవకార్యార్థం
సంభవించె నని తెలిపిరి.
ఇంద్రుపత్ని శచీదేవి
విష్ణులోకమునకు నేగి
విష్ణుని సందర్శించెను
“ఇంద్రాణిని ఓదేవా!
మీ ఊరువు నందున నే
ఉపవిష్టను కావలెనను
ఉల్లాసం అధికమయ్యె,
ఇచ్చగింపు" డని వేడెను
విష్ణువు భూలోకానికి
వెళ్లు మీవు, శ్రీకృష్ణుడ
నై జనింతు అచ్చటనే
నీ కోర్కెను తీర్చగలను.
అని ప్రీతితొ తెలిపినాడు
భూమికి దిగి శచీదేవి
వృషభానుని కూతురుగ క
ళావతియందున పుట్టెను.
కృష్ణుడు గోలోకమ్మున
ఉన్నవేళ రాసమందు
జన్మమంది హరిప్రక్కన
పరుగెత్తెను. రాసమ్మున
నుండి పుట్టి హరి ఎదుటను
ధావన[2] యొనరించుటచే
రాధఅయ్యె నా సుందరి,
శచీదేవి యే రాధగ
వ్యవహరించె నొకజన్మను.

—♦♦♦♦§§♦♦♦♦—

51 నారాయణదాస! భట్ట!!
భట్టభట్ట!! ఆదిభట్ట!!
గర్తపురీ విశ్వమంది
రమ్ము నుంచి విశ్వయోగి
విశ్వంజీ మిమ్ము సర
స్వతి-అవతార మ్మటంచు
విశ్వసించి ఆశీస్సుల
నిట్లు ప్రసాదించినారు

  1. బడబవ - ఆడుగుఱ్ఱము
  2. ధావనము - పరుగెత్తుట

________________________________________________________________________________

850

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1