Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/848

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



నపుడు "కందళి" వోలె
నుద్భవింపగజేసె

—♦♦♦♦§§♦♦♦♦—

50   ఓ నారాయణభట్టా!
భట్టభట్ట! ఆదిభట్ట!
లోకంలో ప్రజలకున్న
అర్హతలకు అనుగుణంగ
ప్రవృత్తి నివృత్తుల రెంటిని
శ్రద్ధతోడ తెలిపినారు
నీవీ[1] మోక్షణవేళను
వస్త్రమూల్యములను విచా
రించువారి శ్రద్ధతోడ
క్రమబద్ధుల జేసినారు
'శృంగారమ్మే మధురము,
అన్యరసము లెల్లను ప్ర
హ్లాదనములు' అని చెప్పిరి.
రక్తిని కట్టించుకొరకు
మర్యాదలు తెలుపుకొరకు
కథాకథన శిష్యుల కిటు
పౌరాణిక వైశిష్ట్య వి
శేషాలను తెల్పినారు.
"తార, సీత, మండోదరి
ద్రౌపదియు అహల్య" ఇందు
వల్ల పంచకన్య లైరి.
గౌరీ ఈశ్వరుల ఆజ్ఞ
పుడమిపైన అవతరించి
నట్టి లక్ష్మియే ద్రౌపది
వేశ్యాపుత్రుడు వసిష్ఠు,
వ్యాసుడు జాలరికి పుట్టె.
మాలెతకు పరాశరుండు
జననమందె తపము చేత
సంస్కారము నొందినారు.
వాలిని నిష్కారణముగ
చంపినట్టి కారణాన
రామచంద్రునకు అబ్బెను
శాపం అది శ్రీకృష్ణుని
అవతారము నందు వాలి
పుత్రుడైన అంగదుండు
బోయవాడు గాను పుట్టి
మృగమనియెడు భ్రాంతితోడ
వేసిన బాణము కృష్ణు
పాదాలకు తగిలి అంత
మరణమ్మును కల్పించుట
వలన జగన్నాథున కా!
తారశాప మంతరించె
వాలి భార్య తార భర్తృ
మృతి నొందుట శోకిస్తూ
రామునితో "సీత తిరిగి
వచ్చినప్పటికిని ఆమె
చిరకాలమ్మును మీతో
కలసి కాపురమ్ము చేయ
కుండుగాక!" అని శపించె.
కృష్ణుని ప్రేమకు లక్ష్యం
కంసుదాసియౌ త్రివక్ర
కుబ్జ కంసునకై గంధ
లేపనాల గొనిపోవుచు
నున్నవేళ భ్రష్టరూప

  1. నీవి - కోకముడి

________________________________________________________________________________

848

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1