Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/832

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



సభలొ చేరి మంద్ర నీచ
కృత్యమ్ముల దుశ్చర్యల
నాచరించు నట్టివారి
ఆకతాయిలు[1]ను, వరాకు[2]
లైన పాపవర్తనులు
దుష్టకార్యలక్షణులను
పాశవత్వ ప్రతీకాల,
పరమ గుహ్య భుజంగాల
సంచిత సమ్మోదముతో
అంతేవాసులు[3]గ' తలచి
అతిపవిత్రులను చేయగ
కన్యావిస్రంభణము[4]
కడు సమర్థులయిన మీదు
ముగ్ద మధుర మంజులమ్ము
నయిన యట్టి పుణ్యలోక
పథికుల గావింపంగా
ప్రదర్శించి నందుకు యే
మును కీర్తిని పొందెదము.
దాసుగారి సంగీతపు
విశ్వ-అంతరాళంలో
తారాకోటిని లెక్కిం
చటము ఎంత అసాధ్యమ్మొ
వైదుష్యము నభినందిం
చుట సైతము అంత బెడద
వారు జానకీశపథం
లోని స్వరమ్ముల చేతను
అందులోని అపురూపా
లైన రాగములలోపలి
వరుసల ద్వారా ముందు
తరములవారికి తమసం
గీతపు పాండిత్యమ్మును
కల్పనలలొ చాతుర్యము
అక్షరబద్ధ మొనర్చి
అద్భుతముగ అందించిరి.
అనన్వయం అనెడు అలం
కారానికి వారె ఉదా
హరణమ్ము వారి జగ
జ్యోతిలోని ప్రతివాక్యం
ఒక సిద్ధాంతము నుద్ధా
టించు వచనమై ఉన్నది.
షడ్దర్శనములు, అష్టా
దశ విద్యలు, చతుష్షష్టి
కళలు అధిగమించినట్టి
వారికి అద్దానిలోని
సిద్ధాంతాలలో కొన్నిం
టికి మూలా లెరుకపడవు.

—♦♦♦♦§§♦♦♦♦—

45  నారాయణదాస సుకవి!
ఆకర్షిత సకల భువీ!
ఓ నారాయణభట్టా!!
భట్ట! భట్ట!! ఆదిభట్ట!!
రానున్నవి దాసభార
తీ ఆవిష్కరణ ప్రచు
రణల ధూర్వహులును మహా
'సుకవీంద్రులు' 'మధురసర
స్వతులు', 'తెలుగు-తానీషా’
ఆంధ్ర విశ్వవిద్యాలయ
ప్రాచార్యులు[5] " మిమ్ము గూర్చి

  1. ఆకతాయిలు = పూర్వాపర సందర్భము లేకుండగ హేళనగ మాట్లాడే వారు,
    ఆకతాయి అని రూపాంతరము.
  2. వరాకులు = దయనీయులైన అల్పులు.
  3. అంతేవాసులు = దగ్గర ఉండువారు (శిష్యులు)
  4. విస్రంభణము - స్వేచ్ఛ
  5. ప్రాచార్యులు = విద్యాలయాధిపతి

________________________________________________________________________________

832

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1