మిమ్ము గూర్చి తెలిపిన వివి
బంధువులందరి భావన.
"కర్మను ఉపదేశింపగ
జైమిని ఋషి, ఉపదేశిం
పగ జ్ఞానము వ్యాసర్షియు
అవతరించి నట్లుగ భ
క్త్యుపదేశం - కోసము శ్రీ
నారాయణదాసు లవత
రించినారు జనుల మనస్
క్షేత్రాలలో “కథాకథన”
రూపమ్మున భక్తిబీజ
ములనాటిరి. వివిధ విద్య
లందు విశారదుడు, సకల
కళాపేశలుడు, బహుభా
షాచతురాననుడు నైన
నారాయణదాసు జనుల
చిత్తవృత్తి ననుసరించి
హరికథాపితామహులును,
సర్వకళాపరిపూర్ణులు,
మహాకవులు, గాంధర్వ
సార్వభౌమ మహానీయులు,
ఘన భాగవతోత్తములును
పరమమహావేదాంతులు
భగవత్పద భక్త్యమృత
పానరతిని త్రిదివమ్ముల
మీద నాధిపత్యమ్మును
అష్టవిభూతిని పొందుట
కంటె, మోక్షపదముకంటె
అత్యధికమ్మయినట్టిది
అంటు వారు వాక్రుచ్చిరి
దాసుగారి ప్రతిభ ప్రధా
నముగ వ్యక్తినిష్ఠమ్ము
వస్తునిష్ఠమెపుడు కాదు
సమకాలిక మహాపండి
తాళి వాక్కు ననుసరించి
ఆయన సాహిత్యమందు
ఎంతటి ప్రతిభాధురీణు
లో సంగీతమ్ము నందు
అంత మహానిష్ణాతులు
వారి కృతుల పరిశీలి
స్తే ఆయన సర్వవిద్య
లందు ప్రవీణులు అన్నది
విదితమౌను విశదంగా”.
44 ఓ నారాయణదాసా!
దాసా! ఓ దాసదాస!
కొందరు విద్యావంతులు
సామాన్యజనానీకం
తోటి కూడిఉన్నప్పుడు
మిమ్ము గూర్చి సంభాషణ
ఈవిధంగ సాగింది.
“అర్థ మెవరి బుద్ధి చెరచు
కామ మెవరి కండ్లు తోడు,
నూదకాలు ఎవరి నిండు
మతులు చెరచి బుద్ధివిరుచ
అట్టి వారు అంటే మీకు
అధికమైన అట్టి జాలి.
గుణదోషమ్ముల చూడరు
బొంకుటాండ్రు రంకుటాండ్రు
________________________________________________________________________________
830
వావిలాల సోమయాజులు సాహిత్యం - 1