Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/821

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



పరివర్తన చేయుటమ్ము
తాను సాహచర్యమునకు
తన స్వామిని, ఆ బృందా
వనస్వామిని, చేరటమ్ము,
వ్యష్టిగా సమష్టిగాను
రాసక్రీడలను నేర్చి
పరమ భక్తిభావంతో
మంద్ర మధ్య మోద్వేగా
లతో సంగమ మొందటాన్ని
అభినయింప నేర్చువరకు
లలితగతులు నేర్పినారు.
ఆ నగరంలో ధనికులు
అత్యాచారాలల్లో
ఆసక్తులు, కడు రసికులు
దేవదాసి కాదలచిన
ఆ గణికాకన్యను తమ
ప్రియురాలిని చేసుకొనగ
మనసుపడుతు ఉన్నవారు
ఆమె నేర్చు విద్య చూడ
ప్రీతితోడ ఆలయాన్కి
అప్పు డపుడు వచ్చి వచ్చి
ఆమె పరాకాష్ఠ నొంది
అభినయించు వేళ చూచి
ప్రేమ భక్తిగా మారగ
అపుడు నిల్వలేక ఇర్వు
రీమహాదేవుపత్ని యయ్యె
పరమ పుణ్యవనిత యయె
ఎంత అందగత్తె ఈమె!
ఎంత దివ్యురాలు ఈమె!!
అని అందరు చూచుచుండ
ఆమెకు నతు లర్పించిరి.
ఈ ఘట్టము చూచి మీరు
"శుభము, శుభము, సిద్ధిగడిం
చినది కన్నె పరమేశ్వరు
పత్ని అయ్యె శుభము" అంటు
ఆనందం పొందినట్లు
లోకంలో ఒక వినికిడి
సృష్టి అంతటికి స్త్రీయే
కారణమ్ము ఆమె తల్లి,
అక్క, చెల్లి, పత్నియు, నుప
పత్ని అన్న విషయము ప్రజ
మరచిపోతు ఉన్నారు.
నేడు పురుషుతో బాటుగ
నారీమణి అన్ని ఉన్న
తమ్ము లైన శిఖరాలను
చేరినది. కాని ఆమె
తాను ఒక్క "వ్యాపారపు
వస్తు" వన్న ముద్ర చెరుపు
కొనలేకుండా ఉన్నది.

—♦♦♦♦§§♦♦♦♦—

35  శ్రీశారద అవతారా!
బహువిద్యాఘనధీరా!!
వివిధరంగముల లోపల
మీకు ఉన్న అనితర సా
ధ్యమ్మౌ ప్రతిభను గురించి
ఆయా రంగాలల్లో
ఉద్దండులు ఔ వ్యక్తులు
ప్రచురించిన “ఆదిభట్ట


ఉపాయనలు

821