Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/818

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



32  శ్రీశారద అవతారా!
ఓ నారాయణదాసా
సకల కళాకోవిద లౌ
నాగరకులు గాన మీరు
పక్షమ్మున కొక్కమారు
పరమశ్రద్ధతో నడిపెడు
నవగోష్టుల వేశ్యలతో
విజ్ఞురాండ్రు, విద్యావతు
లైన మీదు శిష్యురాండ్ర
తోటి కలసి నడిపినారు
శుక్లపక్షమందున జా
గరణము నొనరిస్తూ ఆట
పాటలతో "యక్షరాత్రి"[1]
నేటి మనదు దీపావళి
అశ్వయుజమ్మునకు శుద్ధ
పూర్ణిమనాడున "కౌముది"[2]
జాగరణను రేయియెల్ల
వెన్నెలలో వివిధ కళా
క్రీడలతో గడపినారు
"సువసంతం" అను గోష్ఠిలొ
నాట్యాదుల మూడునాళ్లు
రమ్యంగా నడపినారు
సహకారపు "భంజిక"[3]లో
సమయమెల్ల సహకార
ద్రుమయుత[4] సత్క్రీడలతో
నాట్యగానములతొ సాగు
అభ్యూషాఖాదిక[5]లో 60
చెట్లమీద, శాఖలపై
వ్రాలి, ఒకరిచేతి నొకరు
తాకి, తగిన ముగ్ధ మధుర
భాషణలతో గడుపుతారు
“బిసఖాదిక"[6] లో తూడుల
తోటి ఆడు, వాని తినుట
“నవ పత్రిక"లో క్రొత్తగ
పుట్టిన ఆకులను ఆట
పాటలతో సేకరించి
మందగతుల క్రీడింతురు
“ఉదకక్ష్వేదిక”[7] అందున
వంశనాడులతో - అంటే
వెదురుబొంగు గొట్టాలతో
వసంతాలు చల్లుకొనుట
స్త్రీ పురుషులు రసికతతో
ఆటవోలె ఆచరింత్రు.
"పల్యంకికయానము”తో
మ్మిదవ గోష్ఠి! ఇందు స్త్రీలు
పురుషవరుల, పురుషులు రమ
ణీమణులను పల్యంకిక
లందున నుపవిష్ణుల గా
వించి వారి పల్యంకిక[8]
లను మోస్తూ క్రీడింతురు
దమనభంజికాదు[9] లిందు
ఒక జాతికి చెందినవి.

33. శ్రీ శారద అవతారా!
ఓ నారాయణభట్టా
గానభట్ట! నాట్యభట్ట!!
యౌవనమ్ము నందు మీరు
ఈ గోష్ఠీ క్రీడల కడు
విజ్ఞతతో ఆడినారు!

  1. యక్షరాత్రి = వసంతమున యక్షులవలె శృంగారక్రీడనము జరుపునట్టి రాత్రి
  2. కౌముది = వెన్నెల
  3. భంజిక = త్రుంచుట
  4. సహకార
    ద్రుమయుత = లేతమామిడి చెట్లతోకూడిన
  5. అభ్యూషాఖాదిక = మంచి చవిటి రుచిగల దానిని తినుట
  6. బిసఖాదిక = తామర తూడులను తినుట అను క్రీడ
  7. ఉదకక్ష్వేదిక = పిచికారీ వలె వెదురుగొట్టము తో నీటిని చల్లుకొనుట
  8. పల్యంకిక = పల్లకి
  9. దమనభంజికాదులు = అణచుట , విరుచుట మొదలైనవి

________________________________________________________________________________

818

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1