లాభసాటి విక్రేతల
భక్తజన ప్రాయోజిక
కార్యక్రమ శక్తియుతుల
గానొనర్చి, సర్వమైన
సన్నాహములకు సంప
న్నులను, పరిష్కారములకు
సర్వకాల సంసిద్దుల
గా నొనర్చి పంపునపుడు
పుణ్యకార్య విజయోపే
తులుకండని దీవిస్తూ
శ్రేష్ఠ నతుల స్వీకరించి
వీడ్కోలును చెప్పినారు.
వారికి మీరిచ్చినారు
పరమ దివ్య విక్రాంతుల[1]
అద్భుతాస్త్రజాలమ్ముల[2]
'పాశుపత' మహాస్త్రమ్ము
అందువల్ల వారు వారి
కథనాలలొ మీవలెనే,
లోకంలో పుంజుకొన్న
నరక దుర్గద్వారాలను
భిన్న భిన్న మొనరిస్తూ
నాశనమ్ము చేయగల్గు
దేవలోక దిగ్గజాలు!
ఆకతాయు[3] లెచట వారి
ఇంద్రియ విజృంభణలతో,
కామోద్దీపక వృత్తితో,
దహనాలతో, హత్యలతో,
దోపిళ్లతొ, దుశ్చేష్టల
గర్వోక్తుల భీప్రదులై[4]
వర్తిల్లగ పుట్టినట్టి
ఆకసాన్ని అంటుకొన్న
ఆక్రందన లుద్భవిల్లి
వ్యాప్తినొంద మీ శిష్యులు
భయరహితత ఓ భట్ట!
కీలకరంగాల కేగి
దుష్టులలో పరివర్తన
కల్గింపను, దళితులకును
బాధితులకు ఉపశమనం
చేకూర్పను కృషిచేతురు
ఉపశాంతులు కల్పింపగ
సమయోచిత 'గాథ' ను కథ
నమ్మొనర్చి, మానసిక
స్వస్థత చేకూర్చి, తృప్తి
నిచ్చి, ప్రజల మెప్పునొంది
సన్మానం స్వీకరించి
విజయంతో తిరోగమింత్రు.
—♦♦♦♦§§♦♦♦♦—
29 ఏకాంతంగా శ్రద్ధతో
అత్యంతమ్మగు భక్తిని
ధ్యానముగావించి మిమ్ము
ఆవాహనచేయ మీరు
ఆదరముతొ విచ్చేసిరి!
అపు డిచ్చిన అర్పణ ఇది!
ఓ భట్టా! ఆదిభట్ట!!
జగమునందు పుట్టి నట్టి
జను లంతా మీ బిడ్డలే!
కుల మత భేదాలు లేవు!!
కోర్కెల దోషాలు లేవు!!
- ↑ విక్రాంతుల =ప్రకాశములను
- ↑ జాలమ్ముల = సమూహములు వల
- ↑ ఆకతాయులు = దుష్టులు
- ↑ భీప్రదులై = భయము కలిగించువారై
________________________________________________________________________________
ఉపాయనలు
818