'నార’మ్మనగా జలము.
దాన్ని స్థానముగ నొందుట
నారాయణులైరి మీరు
ఓ నారాయణభట్టా!
శ్రీ నారాయణభట్టా!!
రసజలమ్ము సర్వమ్మును
రమ్యమైన స్థానంగా
గల్గి ఉంట 'నారాయణు’
లైనారు.
—♦♦♦♦§§♦♦♦♦—
శబ్దములు
ఎవని వలన బయలదేరు
అతడు 'రాయణుండు' అతడు
గానివాడు 'అరాయణుండు'
అరాయణుండు గానివాడు
'నారాయణు', డందుచేత
తన వలననె శబ్దమ్ములు
బయలువెడలుచుంట వలన
'నారాయణు' డయ్యె. అట్లె
సర్వమైన శబ్దమ్ములు
మీ ముఖమ్ము నుంచి ఉద్భ
వించుటచే మీరును 'నా
రాయణులే!'
సరసి యందు దక్షపుత్రు
లైనయట్టి పూతాత్ములు
హర్యశ్వులు 19, 20 శబలాశ్వులు
అమితతపము గావించిరి
అమలతపము గావించిరి.
'నారాయణ సరసి' మీది
మీకడనే 'గానకళా
హర్యశ్వులు' 'నృత్యకళా
శబలాశ్వులు' తపమొనర్చి
శామ్యవిద్య నేర్చినారు.
'నారాయణి' శత మూలిక
ఇందీవరి, నారాయణు
వలన బుట్టినట్టి గడ్డ
వేళ్ళచేత ఆవరించి
నది భూమిని, నల్ల కల్వ
పూలుబుట్టు. మీ వలనను
విద్యా శతమూలికలును
ఇందీవరు లెన్నెన్నో
పుట్టి భువిని ఆవరించె
గుణములతో విస్తరించె
మీ సేవాసంస్మరణల
మీరును నారాయణులని
నారాయణదాస భట్ట
నవ్యగతుల మాకు తోచు.
—♦♦♦♦§§♦♦♦♦—
21 శ్రీ శారద - అవతారా!
నారాయణదాస భట్ట!!
ఒక దినాన నేను మిమ్ము
బ్రహ్మశక్తి అని స్మరించి
ప్రార్థిస్తూ ఉండగ విని
అల్పుడొకడు నా శిష్యుడు
"అది ఏ మని అడిగినాడు.
అపుడు నేను ఇటు తెల్పితి
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
ఒకరి నొకరు ఏకీభా
________________________________________________________________________________
ఉపాయనలు
809