హారతులుగ వెలిగించిన
దీపకాంతులను కనులకు
అద్దుకొనిరి హర్షముతో.
ఉన్నవారు పెద్దగాను
సామాన్యులు కొద్దిగాను
కాన్కల నర్పించినారు
మీ ఆపేక్ష ననుసరించి
నగరిలోని శైవాలయ
స్థితిగతులను పెంచుటకై
వాని ఖర్చు చేస్తారట!.
కథలో పాత్రలను గూర్చి
తమ ప్రావీణ్యాన్ని గూర్చి
రకరకాల చర్చిస్తూ.
సాగి ఇండ్లు చేరినారు
పలురకాల భావాలతో
నలుదిక్కుల నుంచి వచ్చి
సభను చేరినట్టి విజ్ఞు
లెల్లవారు తమ్ము గూర్చి
“హరికథాపితామహులే”
“పుంభావ సరస్వతియే”
అన్య మేమియును గాదు
యుగయుగాలు తరతరాలు
జగమునందు వసియించే
జనసంక్షేమం కోసం
వ్యాసుడు బోధించినట్టి
వైదిక పౌరాణిక వి
జ్ఞానపు రుచి చూపినారు
గాంధర్వ కళానుభూతి
శారద తుంబురు జ్ఞాన
ప్రావీణ్యము ఎరుకపరచి
తండు మహానృత్యకేళి
లక్షణాల, నందీశ్వర
నాట్యకళా వైశిష్ట్యము
మంజుల మహతీ కచ్ఛప
తంత్రుల మహాత్మ్యములను
దర్శింపగ జేసినారు.
కథాపాత్ర దృష్టులలో,
గమనాలతొ, పీఠాదుల
విన్యసనల, భంగిమాదు
లందు అభినయించి శిల్ప
కళాపుష్టి నెరిగించిరి.
కాళిదాస, వాల్మీకుల
కవితా మహనీయతతో
మనోభావ మధురిమతో
కథను నడిపినారు దాసు.
వేద శాస్త్ర పురాణేతి
హాసాదులలోని సర్వ
సారజ్ఞులు కడు విజ్ఞులు.
ఇంతటి విజ్ఞానకళా
మేళనాలు అన్యులలో
లభ్యమౌ టసంభవమ్ము
కథాగాన వాచస్పతి
అంటు గౌరవమ్ము నిచ్చి
చెప్పుకొంటు నానారీ
తుల వందన లాచరించి
విఖ్యాతి వహించినట్టి
విబుధులు మా మామగారు
తృప్తుడ నౌ నాచేతను
________________________________________________________________________________
ఉపాయనలు
807