తే. శ్రద్ధ చేరెను శోకభారాన మరల నపుడు నిజ శయన గుహాగృహమ్ములోన ఒక విరక్తిభారము మ్రోయుచున్న యట్లు మించి తనలోనఁ దా విలపించు చుండె. తే. సన్ననౌ శుష్కకాష్టంపు సంధియందు ననలశిఖ యొండు జ్వలియించు చా గృహానఁ దనదు విస్పష్టకాంతితోఁ దమము నెల్ల దూర మొనరించుచుండె సంతుష్టి మెరసి. తే. - కాని శీతల పవనోర్మికలకు నద్ది యొక్కపరి తగ్గిపోవుచునుండె నొక్క పరి జ్వలించుచునుండె నవ్వానివలన- అయిన నద్దాని నెవ రేటు లాపఁగలరు? తే. శ్రద్ధ తన మృదువైన చర్మమ్ము నపుడు పరచుకొని, దానిపైన మైమరచి యుండె ఆమె యున్నది శ్రమమృదులాలసత్వ మొంది విశ్రాంతిఁ గైకొనుచున్న యటుల. తే. Gilb మహిత విశ్వమ్ము నిజ ఋజుమార్గ మందు నడచుచుండెను మెలమెల్లఁ గడగి-తారు. కలకుఁ గ్రమమున నొదవె వికాసగరిమ కట్టఁబడె మృగములు శీతకరురథాన. తే. శార్వరీ సుందరీమణి జారవిడిచెం దనదు జ్యోత్స్నామనోజ్ఞ వస్త్రాంచలమును పొలసి యద్దాని నీడలోఁ బొందుచుండె పరమ వేదనామయ సృష్టి బహుళసుఖము. తే. హిమమహీధరోచ్చయ శృంగకముల యందు నవ్వుచుండెను బ్రకృతి చంచల లతాంగి తనదు ధవళహాసమ్మును దనరఁ జిమ్మి స్నిగ్ధ సుషమల వ్యాపింపఁ జేయుచుండె. ఆంధ్ర కామాయని 45 551
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/551
Appearance