Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తరలి రారండోయీ!

తరలి రారండోయి! తరలి రారండోయి
ఆలసించెద మేమొ అమ్మసేవకు మనము
తొలి తామరల కనులు
తెరచి చూడక మునుపె,
మల్లికల వాసనలు
మనల ముంపక మునుపె తరలి రా...

కేళికళి కెరటాలు
కెరలి యాడకమున్నె
తెమ్మరల గీతాల
ముమ్మరమునకు మున్నె తరలి రా...

ఆనందరసఝరుల
నమృత గానము తోడ,
కలసి పోదము రండు,
సొలసి పోదము రండు...తరలి రా...

తరలి రారండోయీ!
తరలి రారండోయి. కెరలిరా రండోయి
ఆలసించెదమేమొ, అమ్మ సేవకు మనము

______________________________________________________________________________________

442

వావిలాల సోమయాజులు