పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వృత్తి వనిత

మొన్న ఒకదినాన నేను వీధుల్లో ఒక మిత్రురాలి
కడు ఘనముగ మారిపోయి నట్టిదాని కలుసుకొంటి.
ఆమె వీధిలో క్రిందకు చారుగతిని గడచివచ్చె నడ
స్థూల అయిన ఒక బాలిక ఆమె ప్రేమ చిహ్నములతో నికటమ్మున చేరి ఉంది.
ఎత్తుకున్నదామె ఇంకో బొద్దు, ముద్దు పసిబిడ్డను
ఇద్దరము హఠాత్సంగమమునకెంతో నిర్ఘాంతులమై పోతిమి నిశ్చలముగ.
సత్యమ్ములు రాగోపేతమ్ములు నగు భూషణములు
పరివర్తన పొందిన తరి చిరునవ్వులు, వెనుమళ్ళుట
లంత కాలమానములను వీక్షచేసుకొనుటలయ్యె
వృత్తివనిత నైన నేను
ఆలస్యమ్మయిపోతిని
మనుజపత్ని శాంతముగా శీతలముగ నప్పుడుండ
క్షణము నేను తలపోసితి నిశ్చయముగ నేనదృష్ట
శాలిని నాకున్నవి గద వృత్తి గృహము సమయధనము
తదుపరి భావము నాలో పరివర్తన చూపినది
నాలో ప్రేమాపేక్ష నప్పుడనుభవింప జేసినది.
ఒక స్త్రీ పొందగ దగినది సకలమామె పొందగలదు
అయితే మరినేనా? నే నేదుఃఖింపగ దగదు.
ఎందువల్ల నంటే నే స్త్రీ స్వేచ్ఛా చిహ్నాన్ని
అవును నిజమ్మది వనితా స్వీయ సృష్టులందొక్కటి.
అది మూలంగా బాలది అయినవారి ఓహోహో వృతిస్త్రీ ఇటనున్నది.

________________________________________________________________________________________

434

వావిలాల సోమయాజులు