పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎట వనితలు గౌరవింప బడియెదరో


ఎట వనితలు గౌరవింప బడియెదరో ఆ తావుల
సకల దేవతాజాతులు తగుతృప్తిని పొందుతారు.
మహిళాజను లెల్లవేళ మన సంస్కృతి రక్షింతురు (రక్షకులు)
పరమ కృతజ్ఞతతో, ఘన భక్తి, మాన్యతా, కారుణ్యముల నొసగి గణియింపుడు.
వనితాతతికెవ్వరైన కష్టములను కల్పించుట
దోషమ్ముల నొనరించుట బహుళపాపకృత్యములగు.
సోదరి పరిణయ వేళను ఆదరానురాగముతో
రథచోదకుడై యుండగ కంసుం డాయమయష్టమ
సుతుచే మృతినొందెదనుచు గగనవాణి తెలియజేయ
కంసుడు విని కృద్ధుండై సోదరి దేవకి చంపగ ఖడ్గముతో, పైకి వచ్చె
దేవకి పతి వసుదేవుడు యువరాజు కంసునితో
నారీవధఘోరపాప కరణమ్మని కాననాయె ఖండింపగ
వలదనుచును వాదించె మహామృదువుగ
తప్పని సరియైనను మృతి బహుదారణ భీషణమ్ము
దానిని ఒకడెవ్వడైన తప్పించుకొనంగా లేడు
అతితీక్షణమైన భీతి ఆక్రమితుండైన వ్యక్తి
ఎట్లు పరమపాపముగావింపగ తా బూనుకొనునో ఈ అంశము సూచించును.
అతడు బిడ్డలందరి నట పుట్టిన క్షణమే కంసున
కర్పించు ప్రతిజ్ఞతో వసుదేవుడతని నారీ హత్యాదోషము మాన్పించెను.
హృదయ శూన్యుడే కంసుని చేత ఖండనము నొందుట
కై బిడ్డల నిచ్చుటలో చేసిన ఘనమో ప్రతిజ్ఞ
సర్వము సాగించుటలో పూర్ణముగా సత్యసంధు డై ఒప్పెను వసుదేవుడు.
ఇందులెచట సాటిలేదు స్త్రీ జాతిని పరిగణించు
చేష్టను గన నీ జగమున తుల్యుడు లేడతని కెవడు

______________________________________________________________________________________

432

వావిలాల సోమయాజులు