Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీవావిలాల సోమయాజులుగారి పద్యాలు గోరుముద్దలు కావు. గుజ్జనగూళ్ళు కావు. సెనగ గుగ్గిళ్ళు కావు. అవి సానబట్టిన వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ మణిమాణిక్య శకలాలు. పూత పసిడి తళతళలతో చెమికీ దారాలతో చీరెలు నేసేవారు - లంబాడీ లంగాలు కుట్టుకునేవారు వీటి జోలికి పోనక్కరలేదు. భావికాలంలో, సాహితీ ప్రతాపరుద్రులు కాగోరేవారు, కవితా కిరీటధారులు కాగోరేవారు, వీటిని కష్టపడి సేకరించి వినియోగించుకొని, తమ శిరస్సుల చుట్టు పరివేషప్రభలు తీర్చిదిద్దుకోవచ్చు.

- ప్రగతి గీతాప్రవక్త

డా. నండూరి రామకృష్ణమాచార్య


శివాలోకనము

25