నప్పుడప్పుడు నా కామ మంతవఱకె
ఇతర విషయాల మమత సేవించుచుండ.
తే. ఏను నీదు రూపమును దర్శింతుఁ బ్రియుఁడ
విందు నీ వాక్యముల స్వప్నవేళలందు
నీప్రసన్నతనొందెద, నేను నిన్నె
భావనము సేతు మోహసంప్రాప్తి యొదవె.
తే. "అట్టి వయసున జరిగింప నగునె! - ఆమె
యింటిలో డబ్బు మిండని కిచ్చు కొఱకుఁ
దానె కాజేసి చెప్పె సంస్థానమునకు
ఆమె బహురణ కోవిదయైన నారి!"
తే. "చెలఁగు నామె భోగనిరత చిత్రమటుల
నెట్టి వడి చూచు భర్త, వివిక్త, నామె
నొనరించు రతి సాంపరాయములను
వెళ్లి వడిచూచు భర్త, వివిక్త నామె.” 90
తే. "ఉండగారాదు చేరియే యున్న యప్పు
డొంటిగను మన మిర్వుర ముజ్జ్వలాంగి
అటులఁ గావింపఁ గల్గు నా కపజయమ్ము
ఆది నను హర్షరహితుగా నపహసించు.
తే. “నా యెదుట నిల్చి నీవు నగ్నముగ నుండ
సఖియ! ఇంక నెంతగను నసహ్య పడెదు?
అనెడి యా రాత్రి దౌసౌఖ్య - మౌనె స్వప్న
మనుచుఁ జాగృతి నొంది భావన యొనర్తు.”
తే. "అతఁడి కడ రాత్రి నగ్నగా జతురిమముల
గడుపి యలసట నొందెద గాఢనిద్ర
లేచి, అతఁడు వెనుదిరిగి వేచి యుండ
వస్త్రములఁ దాల్చి నే సుప్రభాతమనెద.”
తే. "తెలుపఁగావలె నా ప్రేమ, ధీరుఁ డతఁడు
లేఖ వ్రాయఁగ గ్రహియించు, లేక మాను"
170
వావిలాల సోమయాజులు సాహిత్యం-1