తే. "ఆమె యొక నైజమణి, కాన నవసరమ్ము
సర్వసౌందర్యయుత పరిష్కార గరిమ
అగుట నాయమ యాద్రాక్ష, తగదు కోయఁ
గాపు గానట్టి సమయ మీ కాలమందు. 60
తే. “నీకు నొక భాష నిత్తము, మాకు, ప్రియుఁడ!
ఇమ్ము మరియొక భాష మాంద్యమ్ము వీడి"
అనుచుఁ బిల్తురట విటాళి నద్భుతముగ
ముద్దునకు ముద్దు లొసగెడి ముగ్ధ లెల్ల
తే. "చూచిఫల మేమి? వలయును తూచుకొనగ”
అనిన సుందరి చెల్లెలి నడిగినపుడు
“చూచిననె చాలున” న్నని చూపినదట
అర్ధవస్త్రమ్ము తొలఁగించి యందమెల్ల.
తే. వేరు గ్రామమ్మునకు నేను వెడలునపుడు
పుత్ర! మిండడౌ మగనికి బుట్టి నట్టి
యతని, నినుఁబుత్రుఁగా జెప్ప నాత్మనిచ్చ
వడను తమ్మునిఁగావించి నడచుచుందు.
తే. ఇత్తు నాకున్నవని చెప్పి, యిచ్చవడుచు
నిచ్చె, దనకున్న వ్యాధుల నెల్ల నతివ!
లేదు దోష మాయమ కడ లేశమైన .
కడఁగ నైతిని జాగ్రత్త వడగ నేను.
తే. "నన్ను, యౌవనవతి! నిండు నాల్గు వత్స
రమ్ము లొంటిగ నిద్రించు నమలచరిత!
అనుచు నా పతి రణభూమి నాత్మ నీర్ష్య
నొందు" ననియు నొంటిగఁ బ్రియునొందునొకతె.
తే. స్త్రీలఁ గొందఱ ధర్షణ సేయకున్న
కా దభివ్యక్తి మే జేతృ ఘన జయమ్ము
అట్లు గెల్వంగ బడసిన య య్యంగనలకు
నా విజేతలకడ రహస్యములు లేవు. 66
166
వావిలాల సోమయాజులు సాహిత్యం-1