Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. "భర్త దుఃఖింప దుఃఖము నృడయు నామె
     సంతసించు నాయమ పతి సంతసింప
     భర్త దేశాంతరమ్మేగఁ బడయుఁ బాళి
     భర్త మరణింప మరణించుఁ బరమ భక్తి.'

తే. "గేయనర్తకి, స్వరమేళ-కీర్తన నటి
     నాట్యమొనరించుగతి రాజ్ఞి నాట్యమాడ
     దామె సాగరపుత్రిగా నడుగులేయు
     స్వరము సారించు దేవతావనితవోలె.

తే. ఆమెతో నడిపిన కలహముల వలన
    నీవు ఋతువులు వెంటనే నిలిపినావు
    ప్రస్రవణ లాగిపోవుట వలన నామె
    యయ్యె మధు వీవు పొంది యాహ్లాద మొంద.

తే. "పతిత పాదాలపైఁ బడఁ బనికిరాని
     భ్రష్టు నను వలచితివి నా భార్యవైతి
     “వప్పు చేయించి కారకు నంపినా” న
     టంచు నణువైన శోకమ్ము నంద వలదు. 30

తే. అట్టి దోషినె యైన నే నప్పుడతని
    భార్యకున్ భర్తృ దుర్గుణ పథము దెల్పి
    యొనరఁ జేయించి ప్రతిచర్య లుల్లసిలెడి
    యామెచే మిత్రునకు శాస్త్రి నబ్బఁ జేతు.

తే. కామినీ కాయ గంభీర కాననమున
    ఘనకుచద్వంద్వ మనెడి దుర్గమ్మునందు
    నో మనఃపాంథ! సంచారమొనరజేయం
    దలఁపకు మచట నుండును స్మరతస్కరుండు.

తే. "ముద్దు దొరుకని యప్పుడే యొద్దికలతో (ను)
     పాడఁ బూనవె పెదవులు గోడు వడుచు
     ఎది అయోగ్యమె తెలుపఁగా నదియె పాడఁ
     బడు నటన్నది తెలియఁగా వలయు చెల్లి!


మధుప్రప

161