Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే. ఇట్టు లాధారపడుట రూపించు వెతకు
    చుండు వారిని బానిసలుగను, ఇద్ది
    లక్షణమ్మౌను కనగ నే రాజ్యమందు
    ఇది విశేషమ్ముగాను నయ్యింతిదయ్యె.

తే. ప్రణయ మొనరింతు ననెడి భావముకంటె
    ప్రేమ గావింపబడు చుంటి ప్రీతి తోడ
    ననెడి అనుభూతి సర్వశక్త్యాత్ము జగము
    నధిగమించిన వానిగా నాచరించు.

తే. శక్తి దేహము అన్యోన్య చలనమొంద
    మానసిక దైహికమగు సంగమము నొందు
    టగునొ జగతి ప్రణయ చరమాశయమ్ము
    సత్యమౌ 'ప్లెటానికు' ప్రేమ షండ ప్రేమ. 33

తే. ప్రణయ మింద్రియ కవితని పలికినాడు
    కథకుడైన 'బాల్టాకు' ఆ కామమరయ
    లైంగికమ్ము భావము పొందు సంగమము
    రెంటికైక్యత లేక కాకుంట నిజము.

తే. "ప్రేమ అందమ్ము” అని యొక ఫ్రెంచి ఉక్తి
     అద్ది స్పర్శేంద్రియము చేత నాడసాగు
     ఏకవేళ నింద్రియ శిరోహృదయములను
     కలచు వాల్తేరు ప్రభల వికారమనియె.

తే. అల్పముగ ప్రేమ నొందెడి యట్టివారు
    ప్రణయమొందెడి వారి వ్యాపారములను
    సకల జోక్యమ్ము వహియించి సలుపవలయు
    దాస్యమవసరమైనట్టి దానినెల్ల.

తే. ఇంతి యొకమారు నగ్నగా నెదుట నిల్చు
    టెంతయో మేలు ఆత్మ నర్పించు కంటె
    వలదటన్నను వెంటనే వచ్చు నింద
    రమ్మనగ వలపు మెయి క్రూరాత్మయగును.


మధుప్రప

151