పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

వాసిష్ఠరామాయణము

720
అవ్యక్త మచల మ - నాద్యమై నిండి
దివ్య చిన్మాత్రమే - దీపింపుచుండు,
నల చిత్తున నకు [1]ఋత-మాత్మ సద్ బ్రహ్మ
మలఘు [2]సత్తామాత్ర - మని యార్య జనుల
చేతను వ్యవహార - సిద్ధికై వివిధ
పూత నామములఁ జె-ప్పుట [3]కొప్పు నతఁడు
చెలఁగి యన్యుని పోల్కి - జీవాత్ముఁ డగుచుఁ
గలనా కలత్వ సం-కలితుఁడై చెలఁగి,
మానసంబున మహా - మాయయై మించి
తానె సంకల్ప బృం - దము లగుచుండు,720
మొనసి తత్ సంకల్ప - మున నింద్రజాల
మనఁగ నొప్పుచు విశ్వ - మంతయుఁ బుట్టు,
వనధివల్లఁ దరంగ - వ్రారముల్, కనక
మున భూషణమ్ము లి-మ్ముగఁ బుట్టు కరణి
సత్యమైనటువంటి- సద్ బ్రహ్మమందు
నత్యంత నశ్వర-మగునట్టి సృష్టి
మనమై ప్రకాశించి - మాయాబలమున
మొనసి పృథగ్భావ-ముగఁ గల్గుచుండు
సునిశితమైనట్టి - సూర్యప్రకాశ
మున నెండమావులు - మొనసి కన్పించు730
కరణిఁ బరాత్మ ప్ర-కాశంబునందుఁ
బొరిఁబొరి విశ్వంబు - [4]పుట్టు నీరీతి


  1. ఋతుమాత్ర సద్ బ్రహ్మ - వా.
  2. సత్తనుమాత్ర - వా.
  3. కింపు నతఁడు
  4. పుట్టినరీతి - వా.