పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxvii

వావిళ్లవారి ముద్రితప్రతిలో యతిమైత్రి పొసగనటువంటి ద్విపదపాదాలు,పదాల స్వరూపం మార్పునొంది అర్థసంక్లిష్టత ఏర్పడియున్న చోటులు ప్రశ్నార్థక చిహ్నం (?)తో గుర్తింపబడివున్నాయి.

అలాంటి సందర్భాలన్నీ వ్రాతప్రతి సహాయంతో సముచితంగా సవరింపబడినాయి.

సహజ కవయిత్రి, ప్రజాకవయిత్రి యయిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబగారి ప్రయోగసరణిని దృష్టిలో నిడుకొని ఈ కావ్య పరిష్కరణంలో ఛందో, వ్యాకరణాది లక్షణానుసరణం మెలకువమెయి పాటింపబడింది.

అద్వైతతత్త్వాన్ని ప్రవంచించే కావ్యాల్లో అగ్రగణ్యంగా విరాజిల్లుతూవున్న ఈ కావ్యరత్నంయొక్క పరిష్కరణ కార్యాన్ని మొత్తంమీద ఈ కవయిత్రీమతల్లి హృదయానికి అనుగుణంగా కొనసాగించియున్నా నని సహృదయ లోకానికి విన్నవిస్తూవున్నాను.

'శ్రీరామునిలాంటి శిష్యోత్తముడూ, వసిష్ఠునివంటి వరిష్టుడైన ఆచార్యోత్తముడూ, వాసిష్ఠ రామాయణం లాంటి ఆధ్యాత్మిక కావ్యమూ అంతకు పూర్వం లేవు; ఇకపై ఉండవు'- అనే ప్రసిద్ధి సంస్కృత మూలంతో పాటుగా, సుపరిష్కృత రూపంతో ఇప్పుడు వెలువడుతూవున్న ఈ మహాకావ్యానికి శ్రీవారి కృపావిశేషంతో ఇంతో౽ధికంగా చేకూరగలదని ఆశిస్తున్నాను.

“శ్రీరామసదృశః శిష్యః, వసిష్ఠవదృశో గురు:।
వాసిష్ఠవదృశం కావ్యం నభూతో నభవిష్యతి॥”


★ ★ ★