పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

వాసిష్ఠరామాయణము


తా వాచరింపఁ, ద - త్త్య జ్ఞాన మాత్మ
లోనె ప్రకాశింప, - లోక జాలముల

నిరసించి, యట మీఁద - నిస్పృాహుం డగుచుఁ
బరమైన నిర్విక - ల్పసమాధి నుండె.

అలరుచు నంతట - నతనిధన్యతను
దెలియుటకై వన-దేవత యతనిఁ 500

జేరి తా వందనాల్‌ - చేసి నుతించి,
“ధీర! దాశూర! నా - దెనఁ గృపనుంచి

“యిపుడు నా కొక పుత్రు - ని మ్మీయకున్న
నపరిమితాగ్నిలో - నైనను జొచ్చి

తనువు నీ కర్చింతుఁ - దక్కక యిచట"
నన విని నవ్వుచు - నమ్మహామహుఁడు

తనచేతికమల మా - తరళాక్షి కిచ్చి,
'వనిత! మాసమునకు - వరపుత్రకుండు

గలుగు, న న్నిట బలా - త్కారంబు చేసి,
యలరుచు సుతుని నీ - వడిగితి గాన, 510

జనియించు సుతుఁడు వి - జ్ఞాని యౌ'ననిన
విని యది పలికె 'నో - విమలాత్మ! నాకు

సుజ్ఞాని యైనట్టి - సుతుఁడు గల్గినను
ప్రజ్ఞానమేత! నీ - పద సేవ చేయ

వాని నీ చెంత - నిలిపెద' ననుచు
నా వనదేవత - యట మ్రొక్కి పోయి,

మానంబునకు సత్కు - మారునిఁ గాంచి,
యా సుతుఁ గొని చని - యచలాత్మయగుచు