పుట:Upanyaasapayoonidhi (1911).pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ట్టుచున్నవికావున మిమ్ము ద్రాగవలదని నివారించితి నని పలికెనంట. అట్లయిన వానిని స్తుతించిరేమన, నీళుల కంపుకొట్టుచున్నను వానిభక్తి చాల వినిర్మలమై యున్నది. తనకు మనోహరముగా గాన్పించినవస్తువు తనయేలికకూడ నను భవించవలనను సచ్చింత వానికిగలిగినది. అక్టోభక్తుని మనసు నొచ్చునట్లు మనము చేయగూడదు. అందుమూలముచే నానందించినెనని రాజు బదులు చెప్పెనంట. దైవారాధనమును నిట్టిదియే. దైవమునందు మనకుగల భక్తికాతడు మెచ్చునుగాని మనమర్పించిన వస్తువుయొక్క యమృతాధికతలను బట్టి కాదు. అనితనకు గొఱత యగుటచేత గాదు.

                                *

రామమోహనరాయలవారు.

    ఈతడు వంగిదేసము నందలి రాధానగరమునందు జనించి హిందూదేశ నిర్మాణమునకు శంఖుస్థాపనము చేసిన మహనీయుడు.  ఇతడుఏకేశ్వరా రాధముకై బ్రహ్మసమాజమును స్థాపించినను యిప్పటి బ్రహ్మసమాజములలో బెక్కండ్రవలె హిందూమతమునకు గర్భశత్రువు గాదు. వీరుస్థాపించిన బ్రహ్మసమాజ మతమునకును హస్తిమశకంతరం గలదు.  ఇప్పటి విధ్యాదికు లయిన బ్రహ్మసమాజకులలో బెక్కండ్రు విదేశీయ విద్యామహిమనే అలవఱచుకొన్న మహా పండితుల లగుటచే