ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నలుఁడు, సత్యసంధత.
395
మాబ్రాహ్మసామాజికపు సోదరులలోఁ గొందఱికి దేశాభిమానము మితిమించుటచే నీదేశపు పెద్దలనిన వీరికి దలనొప్పి; ఈదేశపు పురాణపురుషులనిన వీరికిఁ గడుపు మంట. ఈదేశపు టాచారములనిన వీరికి హృదయశల్యము. ఈదేశపు వ్యవహారములనిన వీరికి కంఠపాశము. ఆహా! ఏమి దేశాభిమానము! సత్యసందర్భములో విద్యార్ధులు ఏబుల్లుదొరవారినో హాగ్గుదొరవారినో యుదాహరణముగానిచ్చిన ఆ విద్యార్ధులు చెప్పినదానిని బహువిథములఁ గొనియాడియుందురు. ఇదియా దేశాభిమానము !! "సత్యమేవజయతి"
బ్రాహ్మసామాజికులు - విగ్రహారాధనము.
మాపురమునఁ గొంతకాలము నుండి బ్రాహ్మసామాజికుల యర్చావిధిననుకరించి ప్రార్థనసమాజము నొకదాని నేర్పఱచుకొనిన సోదరులు కొందఱు కలరు. వీరు జూలైనెల 28 తేది ఆదివారమునాడు తమ సమాజపు సాంవత్సరికోత్సవమును సాగించుకొనిరి. ఎవరికిష్టమగు మార్గమునవారు దైవారాధనము జేసికొనుటకు సర్వస్వాతంత్ర్య