Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

364

ఉపన్యాసపయోనిధి.

universal Soul of the universe" (ఉపనిషణ్మతమునుపురాణమతమును నొక్కటియేయని దీనితాత్పర్యము) ప్రాజ్ఞులెల్లరు నిటుచెప్పుచుండఁగాఁ బురాణమతమువేఱనియు ఉపనిషణ్మతము వేఱనియుఁ జెప్ప నీశ్వరవాది పత్రికాధిపతిగారు సాహసించుచున్నారు. కానిండు వారీవిషయమునఁ జెప్పునది యంతయు నైనతరువాత సత్యనిర్ధారణార్ధమై వారివ్రాతనుచితరీతిని విమర్శించుచున్నాము.

బ్రహ్మమతము - ఈశ్వరవాది.


ఈశ్వరవాదియను పత్రికారాజమును బ్రకటించు మాసోదరులు తమ 1906 నవంబరు సంచికలో మమ్ముంగూర్చి యిట్లనుగ్రహపూర్వకముగా వ్రాయించియున్నారు.

"ఆర్యమతబోధినిపత్రికాధిపతులవంటి పండితులుసహితము బ్రాహ్మమతముజుట్టుకత్తెరింపుల మతమనియు క్రైస్తవమతముయొక్క యవతారమే ననియు, మొదలగునపనిందల నారోపించుచుండ జనసామాన్యమున కీవిషయమగోచరముగా నుండెననుట యదార్థమని మనమందర మామోదింపవలసినదేగదా" అని