Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్రిమతములు.

83

త్రిమతములు

లోకములో ననేకమతభేదములు కలవు. ఆయామతములందు మరల ననేకావాంతర భేదములుకలవు. పరమతము లనేకా వాంతర భేదములతోఁ గూడుకొనియున్నవని యధిక్షేపించుచుండు క్రైస్తవుల మతమునందుఁగూడ నూటయేబదికంటెను నెక్కుడుభేదములు కలవు. వాని యీశాఖలన్నియు నేవేవో యప్రధానవిషయములందు భేదబుద్దిని గలిగించుకొని పరస్పర వైషమ్యముతో నున్నవేకాని యెన్నఁదగిన భేదముకలవికావు. మన హిందూమతమునందును ననవసరములగు భేదములనేకములు కలవుకాని త్రిమతములని పిలువంబడుచున్న ద్వైత, విశిష్టాద్వైత అద్వైతమతములట్టివి కావు. ఇవిన్యాయ్యమగు భేదమునుగలిగి జ్ఞానముయొక్క క్రమాభివృద్ధిని తెలుపు స్వాభావిక మతశాఖలైయున్నవి.

జీవేశ్వరులకు భేదమునుదెల్పునదిద్వైతము, జీవేశ్వరులకు నభేదమును దెలుపునది యద్వైతము, జీవేశ్వరులకు నొకవిధముగాభేదమును నిఁకనొకవిధముగానభేదమును దెలుపునది విశిష్టాద్వైతము. వీనిలో నేదిలేకపోయినను సత్యజ్ఞానము కలుగనేరదు. ద్వైతములేకున్న ప్రారంభదశయేలేదు అద్వైతము లేకున్నఁదుదిదశయేలేదు. ఈ రెండును నుండి నడిమిదియగు విశిష్టాద్వైతమేలేకుండిన మధ్యదశయేలేదు. మధ్యది