పుట:Upanyaasapayoonidhi (1911).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గణపతిపురాణమని యొక పురాణముకూడ నీతనిగూర్చియే కలదు. మనవారెయ్యది యాదరించినను ముందుగాగణపతిని బూజించి తీరుదురు. ఇంతవ్యాప్తియందుగల యీదైవతమునుగూర్చి ముచ్చటించు కొనుటకు మంచితఱి తటస్థించినప్పు డేయీపావనకార్య మొనరించుట ముఖ్యకతన్‌వ్యముకదా.

హిందువులకు బలువురు దైవతములు కలరనియు నందులోనీ విఘ్నేశ్వరు డొక్కడనియు నజ్ఞులు తలంచుచున్నారు. అదిసత్యముకాదు. ఏకేశ్వరారాధనమును బోధించుమతములలో నగ్రగణ్యము హిందూమతము. "అట్లయిన నీవిఘ్నేశ్వరుడెవరు?" అందురేని, ఈతడే పరబ్రహ్మము. ఈతడే పరమాత్మ. "శ్లో|| యంబ్రహ్మ వేదాంత విదోవదన్తి |వరంప్రధానం పురుషంతధాన్యే | విశ్వోద్గతే: కారణమీశ్వరంవా | తస్మైనమో విఘ్నవినాయకాయ||" అనుశ్లోక రాజమును ప్రతిహిందువును నక్కరములు నేర్పినది మొదలు పఠించు చున్నాడుగదా. వేదాంతు లెవనిని పరబ్రహ్మమని చెప్పుచున్నారో, అన్యులు (అనగా సాంఖ్యాదులు) యెవనిని ప్రధాన పురుషునిగా జెప్పు చున్నారో యట్టి వినాయకునకు నమస్కారము అని దీనితాత్పర్యము. "క|నరవిశ్వోద్గతి హేతువు వరముడు పురుషుండు ప్రకృతి బ్రహ్మముపరమే | శ్వరుడంచు డద్జు లెవ్వని | బరికింపుదురగ్గణాధిపతి నర్చింతున్||" అని సీతారామాంజనేయ సంవాదకారుడు గణపతిని బరమాత్మ గావణిన్ంచియున్నాడు, ఈరీతిగా గీర్వాణకవులును నాంధ్రక