పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

22

చేతను దర్శించుట చేతను మహాపవిత్రుఁడై జీవనుక్తుఁ డగును, ఏకాద శీవ్రతము ననుష్ఠించనివాఁడయ్యును సంధ్యావిహీనుండయ్యును నాస్తి కుండయ్యును నరఘాతియయ్యుం బరిపూతుం డగును, శస్త్ర జీవియు ధావకుండును శూద్రయాజగుండును వృషవాహుండును మద్భక్తజన స్పర్శనదర్శనములఁ బూతత్వము నొందు, విశ్వాసఘాతియు మిత్రఘా తియు మిధ్యాసాత్యము సెప్పినవాడును స్థాప్యము హరించిన నాల డును మద్భ క్తస్పర్శదర్శనము లవలనఁ బూతు లగుదురు. మద్భక్త స్ప ర్శదర్శనమువలన ఋణగ్రస్తుండును వార్ధిషి కుఁడును జారజుఁడును పుంశ్చలీపతియు పుంశ్చలీపుత్రుంకును పవిత్రు లగుదురు. శూద్రుల యిండ్లలో వండువాఁడును దేవలుఁడును గ్రామయాజకుఁడును అదీ క్షితుఁడును అశ్వత్థవృక్షమును ఖండించిన వాఁడును నాభ క్తుల నిందిం చువాఁడును నివేదనము సేయక భుజించువిస్రుఁడును నాభ క్తులఁగాంచి నను స్పృశించినను పరిపూతత్వ బు నొందుదురు. తల్లిని తండ్రిని భార్యను బ్రోతలను కుమారుని కూఁతును గురుకులమును భగినిని వంశ హీనుం డగుభాంధవుని శ్వశ్రూశ్వశురులను స్వీకరింపనివారలును దేవ ద్రవ్యావహారియు విప్రద్య వ్యాపహారియు లాక్షాలో హరసముల విక్ర యించువారలును కన్య కావిత్రయము సేయువాగును శూద్రశవముల దహించువాఁడు నుమహాపాతకులు, అట్టివారును నాభ క్త జనుల దర్శసస్ప ర్శనములవలనఁ బూతత్వముఁ జెందుదురు' అని చెప్పిన విని లక్ష్మీ దేవి యిట్లనియె. ఓభక్తానుగ్రహకారకుఁడా భక్తులలక్షణముఁ దెల్పుము. వారలసందర్శనము చేతను సంస్పర్శము చేతను నరాధములు సయితము తక్షణమునఁ బరిపూతు లగుదురుగ దా? హరిభక్తివిహీనులును ధూర్తు లును మహాహంకార సంయుతులును ఆత్మ స్తుతిపరాయణులును శరు లును సాధునిందకులును నరాధములు.ఎవ్వారు స్నానము సేయుట కవ గాహనము రచించుట చేత సర్వతీర్థములు పావనము లగునో? ఎవ్వారి