పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72

బ్రహ్మవైవర్తమహాపురాణము. ప్రకృతిఖండము.


  • తులసీ ధ్యానము, పుష్పంబులలోపల సారయయి; సతియయి; పూజ్యురాలై ;మనోహారిణియై, సకలపాపముల నెడి యిద్యములనుదహియిం చుటకుజ్వలించుచుండునగ్ని జ్వాలలకు సమానురాలై ; పుష్పంబు లందును దేవ స్త్రీలయందును దనకుఁదులన లేమిం జేసి తులసియను పేరువడసియ న్నింటికింబవిత్ర రూపిణియై; యందఱకు నుశిరంబుల ధారణము చేసికొనం దగినదియై, ఈ ఫ్సితంబులొసంగి విశ్వపావనియై; జీవన్ముక్తురాలై, ముక్తి ప్ర దయై;హరిభ క్తి గలుగంజేయునదియై; యుండుతులసీ దేవినిభ జిం చెదను. అనియివ్విధమున ధ్యానించి పూజించి స్తుతించి బుధుండగువాఁడు ప్రణా మంబులాచరింపంజనును. ఓనారదా తులస్యుపాఖ్యానము నచించితిని. మఱియు నేమియడి గెదవు.

తులసీ ధ్యానమూలము.* శ్లో || తులసీం పుష్ప సారాంచసతీం పూజ్యాంమనోహరాం | కృత్న పో పేళ దాహాయ జ్వలదగ్ని శిఖోపమాం. || పుష్పేషుతుల నాప్యస్యా నాసీద్దేవీషు వాము నే | పవిత్రరూపొసర్వాసు తులసీ సాచకీర్తితా || 9 || శిరోధార్యాంచసర్వేషా మిఫ్సితాం విశ్వపావనీం|జీవన్ముక్తాంము క్తిదాంచ భ జేతాంహరిభ క్తిదాం || 3 .


ఇది శ్రీ బ్రహవైన రమహాపురాణమునఁ బ్రకృతిఖండమునందు నారాయణ నారద సంవాదమునందుఁ దులస్యుపాఖ్యానం బనుద్వావింశాధ్యాయము ముగి సె ను.. -- - శ్రీ తుల స్యు పాఖ్యానము . స • పూగ్ల ము. I