పుట:Thobithu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. అంతట నామె గవాక్షము చెంత నిలుచుండి చేతులెత్తి ప్రభువును ఈ రీతిగా ప్రార్థించెను

"దయామయుడవైన ప్రభూ! నీకు స్తుతి కల్లునుగాక నీ దివ్యనామము సదా కీర్తింపబడునుగాక నీవు చేసిన ఈ సృష్టియంతయు నిన్ను సన్నుతించుగాక

12. నేను నీవైపు కన్నులెత్తి నిన్ను శరణు వేడుచున్నాను.

13. నే వొక్కమాట పల్కినా ప్రాణములు కొనిపొమ్మ నేనీ యవమానములను ఇక భరింపజాలను.

14. ప్రభూ! నా కన్యాత్వ మింతవరకును చెడలేదు ఏ పురుషుడు నన్నింతవరకు ముట్టుకోలేదు ఈ సంగతి నీకును తెలియును

15. నేనీ ప్రవాసదేశమున ఇంతవరకును ఎట్టి చెడ్డపేరును తెచ్చుకోలేదు మా తండ్రికిని అపకీర్తి తేలేదు నేను మా తండ్రికి ఏకైక పుత్రికను అతనికి మరియొక వారసు లేడు నేను పెండ్లి యూడుటకు మా తండ్రి తరపు చుట్టములు గూడ ఎవరును లేరు, ఇప్పటికే నా భర్తలేడుగురు చచ్చిరి ఇక నేను బ్రతికి మాత్రము ఏమి లాభము! నా ప్రాణములు గొనిపోవుట నీ కిష్టము కాదేని ప్రభూ! నన్ను ఆదరముతోనైన జూడుము ఈ యవమానములను మాత్రము నేనిక భరింపజాలను.”

16 తోబీతు మరియు సారా చేసిన ఈ ప్రార్థనలను దేవుడు మోక్ష పదమునుండి ఆలించెను. 17. అతడు వారికి తోడ్పడుటకు తన దూతయైన రఫాయేలును పంపెను. తోబీతు కన్నులలోని పొరలను తొలగించి అతనికి

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/10&oldid=237506" నుండి వెలికితీశారు