పుట:Thimmarusumantri.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమప్రకరణము

133


లభించుచుండెను. తిమ్మరుసు కాలమునాటినుండియు సామ్రాజ్యమునఁ బలుకుఁబడి తెలుఁగువారికే యెక్కువగ నుండెను. విస్తీర్ణమునఁ బెఱిఁగినది సామ్రాజ్యము మాత్రమేగాక రాజధానీ నగరముగూడ నానాముఖములఁ బెఱిఁగినది. నాగలాపురము మొదలగునవి నూతనముగాఁ గట్టఁబడినవి. మంచిభాట లేర్పడినవి. నగరమునకు మంచినీటి వసతి యేర్పఱచఁబడినది. మహానగరమంతయు జనవృదియు, వస్తుసమృద్ధియు, గలిగి వఱలుచుండెను. నగరాకృతిని వీక్షించినప్పుడును, నగరైశ్వర్యమును దలపోసికొన్నప్పుడును, పాశ్చాత్యులకు సయితము దిగ్భ్రమను బుట్టించి ప్రపంచమున నిట్టి మహానగరమును నెందును జూడలేదని యచ్చెరువందునట్లుగా నుంచెను. తిమ్మరుసునకు సమకాలికులయిన పోర్చుగీసు చరిత్రకారు లెందఱో యామహానగరవైభవమును గన్నులారఁగాంచి యిట్టినగరము ప్రపంచమున లేదని యభివర్ణించి యున్నారు. అట్టి వర్ణనముల సామ్రాజ్య చరిత్రమునఁ బాఠకులు పఠింపఁగలరని యిందు వ్రాయ విరమించినాఁడను.

ఇట్టి మహానగరమునఁ బౌరజనుల మాన ప్రాణ ధనాధులకు నెట్టి యుపద్రవముఁ గలుగకుండఁ బండ్రెండువేల యారక్షకభటసైన్యముతో నొక నగరపాలకుఁడు నగరాధ్యక్షుఁడుగా నియమింపఁబడియెను. ఇతఁడిప్పటి పోలీసు కమిషసరువంటి వాఁడు. ఈనగరాధ్యక్షుని కార్యాలయము టంకశాలకు నెదు