పుట:Telugunaduanuand00srirsher.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  
గీ. శక్రపొంగళ్ళు సాపాట్లు సగముపాళ్ళు
పెళ్ళినడవళ్ళు వేయారు పెట్టుబళ్లు
నిత్యమును గామ్యములు సొమ్ము నిజము గోల
కొండవ్యాపారులం దాంధ్ర మండలమున.

సీ.ఎలమిఁ జీపురుబట్టి యిల్లూడ్చునపుడైన
              పోనీరు తలజుట్టు పూల మెరగు
అసదుగా జలకంబులాడు వేళలనైన
       పోనీరు నునుగొప్పునూనె మెఱుగు
మడిగట్టి వంటకాల్కడ తేర్చునపుడైన
       పోనీరు తోడగు కడానిమెఱగు
నాయకాలింగనోన్న తసౌఖ్యమందైన
       పోనీరు కొంతైన మేని మెఱుగు

గీ. తనులతా చారు తాశుచింతా విభూష
ణాంబితాంగ విలాసతా వాత్తినతుల
మతుల సుకృతులఁ గృతచమత్కృతులఁ గోల
కొండవ్యాపారసతులఁ బేర్కొనఁగఁ జనదె.

ద్రావిడులు


ఉ. ద్రావిడవైదికో త్తములధర్మములన్నియు దేశ్యతుల్యముల్
గా వొకకొన్ని భేదములు గానగవచ్చు శివాక్షమాలికల్
లావు, సదావహీంత్రునవలాల్ కుడి పైటలు, కచ్చకట్టులా
లేవు, వివాహశుల్కములు లెస్సలు, సాములు దేశయాత్రలం
బ్రోవిడుసొమ్ము లంగనల పూర్వభవార్జిత పుణ్యలబ్ధముల్.

వివాహములు


ఉ. చెప్పకయున్న దోషముగుఁ జెప్పినగోపము లేమిసేయుదున్
జెప్పకతప్పదీవయిపు సీమల బ్రాహ్మణకోటి గన్యకల్
గొప్పగిరాకి పెద్దపడి గుండున నల్బది సేర్ల వెండికి౯
జప్పుడు లేకఁ దూగు నదిచాలక యున్న మఱొక్క సేరగు౯.

ఉ.చెప్పిన కార్యమే మెవరు జేతురు నాపలు కాలకించి, వెం
కప్పకుడెబ్బ దేఁడ్లు నరసమ్మకు నెన్మిదియేడు లీదుగాఁ
జొప్పడేనంచు నాంధ్రపద సూరులు తప్పక పొంతనంబుల
జెప్పుడు రెంతతప్పుపనిచీ! ముసలింబసి కాయమెచ్చునే

ఉ. అప్పుడెపెండ్లివచ్చె మన యమ్మికినంచును తల్లిదండ్రియ
న్నప్పలు జెప్పగా వినుచు నాయిఁక్రదోయిలమబ్బెఁ జిక్కిలాల్
పప్పులుపాయసాలరిసె పప్పులుకుప్పలు తెప్ప లప్పరో
యెప్పుడే చెప్పు చెప్పుమని యీడ్తురు పయ్యెద కొంగుఁబట్టికీల్
గొప్పున కొప్పులై కురులు గూడని యీడుననాంధ్ర బాలికల్.

ఉ. చేతురుకయ్య ముల్గడుసు చెయ్వుల వియ్యపురాండ్రు; చాలునీ
కూతురిసారెలోనిడిన కోక యిదోవది రెండుమూళ్ళు; నీ
కూతురిసారె నేను గనుఁగొంటినిగా పదిమూళ్లె లేదుగా
నీతులులాతికిందెలుప నేర్తువటంచును మూతిద్రిప్పుచు౯.