పుట:Telugunaduanuand00srirsher.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  
సీ. చీటికిమాటికి శ్రీమతే రామాను
                జాయనమోయంచుఁ జదువుసొగసు
నిరుపమభక్తిచేఁ బెరుమాళ్ల సుఫిరాట్టు
      దిరువడిఘళ్ గొల్చి యెఱఁగుసొగసు
సారెసారెకుఁ దిరువారాధనంబులఁ
      దిగవాయి మొడినోటఁ దెలుపు సొగసు
జ్ఞానులఁగని యడియే నడియేను దా
      సోహమ్మనుచుఁ బల్కు నట్టిసొగసు

గీ. పరగఁ బన్నిద్దరాళ్వార్లఁ బరమభ క్తి
మించి తిరుమంత్ర మొనర సా యించుసొగసు
పొగడుచో వేయినోళ్ళకు మిగులుగొంత
వైష్ణవ బ్రాహ్మణులదె దైవప్రపత్తి.

సీ. తిరుమణి తిరుచూర్ణ తిరుణాళ్ళు తిరుమంత్ర
               తిరుమాళిగయు తిరుక్కరియమధులు
తిరువీధి తిరుగలు తిరునామములు తిరు
       వారాధనము తిరు వాయి మొడియు
తిరువధ్యయనమును తిరుమంగయాళ్వారు
       తిరువేళికయు మఱి తిరువడిఘళ్లు
తిరుపతి తిరుమల తిరువీసములు తిరు
       ప్పణ్నేరములు తిరు ప్పావుమఱియం

గీ. తిరువలి క్కేణి తిరువటూర్తురువంద
పురమును తిరువళ్ళూరును తిరుతుళసియు
తిరుతిరు తిరుత్తిరు త్తిరు తిరుతిరుతిరు
దిరుగువైష్ణవ పరిభాష తెఱవు మఱుగు.

ఉ.ధారుణిమీద గాళ్ళోరయ దట్టుపయి౯దగఁగూరుచుండి వి
స్తారపుమోపుగట్టి మడిసంచులుముందిడి, వెన్క దిండిసం
బారపుమూటపెట్టి యెడ బాయనిదాసుడుదోల శిష్యసం
చారముకై ప్రయాణమగు స్వామినిత్రోవనెచూడగావలె౯.

సీ.భుంభుంభురూంభుంభు౦మ్మటంచును
                భూరగొమ్ములవారు ముందునడువ
ఢండండడండడం ఢంఢమ్మటంచును
       ఢంకాలవారొక వంకనడువ
ఖణ్నీల్ఖిణీల్భిణీల్ ఖిణ్నీలటంచును
       గిలకకఱ్ఱలవారు కెలననడువ
గుళుగుళుగ్గుళుగు గ్గుళుగుళ్ళటంచును
       గురుసంస్తుతులవార లొరసినడువ

గీ. రంజితములైన ముత్యాల పిఁజరీల
పైడియడ్డల బంగారు పల్లకీల
చెలగి తిరువీధివేంచేపు జేసికొనుచు
వచ్చు జియ్యలవారు శ్రీ వైష్ణవులను.

సీ. వల్లకీపై నొక్కి బహుజనంబులు గొల్వ
               బూరలూదుచువచ్చు వారలొకరు
బడుగుగుఱ్ఱ౦బుల పైనెక్కి కావటీ
       వాని బెట్టకవచ్చు వారలొకరు