పుట:Telugu merugulu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

తెలుంగుమెఱుంగులు


స్వప్నవృత్తాంతమును గవి కృష్ణరాయల కేఱిగించెను. ఆ రాజముఖ్యుం డిట్లనియె.

“నీవును బాలకృష్ణ పదనీరజభక్తుఁడ వార్యచిత్త మో
చాపహసద్గుణుండవు రమాధిపునిం గలలోనఁగాంచి య
దేవు హితోపదేశమునఁ దేజము నొందినవాండ విన్నిటన్
గావున నీ ప్రబంధము ప్రకాశముగా హరి కిమ్ము నావుడున్"

ఇందు పురాణాదులనుండి పుణ్యకథలను రామభద్రకవియే సేకరించిన ట్లున్నది, రాయలవారీ సంస్కృత గ్రంథానుస్మరణము లేదు. ఉపలభ్యమానమగు గ్రంథము తుదిపద్య మిది.

"కడు వచియింపరానిఘనకష్టము లెల్లను గృష్ణుసత్కృషన్
గడచితి మింకమీఁదను ఘనస్ఫుట రాజ్య రమాభివృద్ధిచొ
ప్పుడు నని మీరు గోరుటలు బాపురె వ్యర్ధము లాయె, నింక నే
నుడువఁగ నేల మృత్యువెడసూల్కొని కాసఁగవచ్చు చోటులన్

. ఈ తుదిపద్యము కృతికర్తదో, కాదేని కృతి ప్రేరకునిదో యవసానమును దెలుపుచున్నట్లున్నది.

శ్రీకృష్ణదేవరాయలవారీ కడపటికాలపుకడగండ్లకే యీపద్యము కడుంగడు సరిపడునదిగా నున్నది. ఏకపుత్రుఁడు చనిపోవుట, తిమ్మరుసుకన్నులు తీయించుట, తత్పుత్రుని తిరుగఁబాటు, తగవులు, ఈ సంక్షోభములో రాయల మరణము–ఇన్నింటి నీ పద్యము ధ్వనించుచున్నది.

శ్రీకృష్ణరాయఁడు రామభద్రకవి 'నీవును బాలకృష్ణ పదనీరజభక్తుఁ డవు' అన్నాఁడఁట. ఇక్కడ విశేష మే మనఁగా, నుదయగిరిని జయించి నప్పుడక్కడనుండి మిక్కిలి చక్కని బాలకృష్ణ విగ్రహమును శ్రీకృష్ణదేవరాయలు విద్యానగరమునకుఁ గొనివచ్చి దేవళము కట్టించి యందుఁ బ్రతిష్ఠించి పూజించుచుండువాఁడట.