పుట:Telugu bala Satakam PDF File.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

103. తాను తినక యున్న తన బిడ్డ నొటికి పెట్టు చుండు నమ్మ ప్రేమమూర్తి సకల దేవతాళి సాకారవు అమ్మ తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

104. ఎట్టీ కష్టమైన గుట్టుగా నుంచక ఎఱుక పరుప వలయు నింటి వద్ద కన్నవారి ప్రేమ కడవారి కుండునా? తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

105. అమ్మ మొదటి గురువు అనెడి మాట నిజము పదము పదము నేర్పు పంతులమ్మ అమ్మ మించు గురువు అవనిలో లేకుండురా తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

106. ముద్దా ముద్దా కలిపి ముద్దుగారెడునట్లు బోసినోిటిలోన బువ్వ పెట్టు అమ్మమించునట్టి ఆరాధ్యులే లేరు తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

108. పేరు పొందినట్టి ప్రియమెన బిడ్డలన్‌ కాంచి సంత సింత్రు కన్నవారు అమ్మ నాన్న మించు ఆత్మబంధులు లేరు తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

109. తెలుగు బాల పేర వెలువరించినయ్టి శతక పద్య ములను శ్రద్దతోడ చదివినను వినినను జ్ఞానధనము వచ్చు స్పూర్తి గలుగు మరియు కీర్తి పెరుగు 24

తెలుగు బాల శతకం


</poem>