పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్ధికవిప్లవం బానాటికానాటి
    కిబ్బడిగా విజృంభించుచుండె
తలవిప్పుకొని గర్భదారిద్రదేవత
    స్వైరవిహా రమ్ము సలుపుచుండె
పైపెచ్చుపన్నులబాధ యంతయుమించి
    తీరనిచిక్కుల దెచ్చుచుండె
సరపత్తె మింతైన దొరకక యప్పుల
     యెత్తిడుల్ మనుగడే నొఱయుచుండె

దేశకలస్థితులు గూడ దినదినంబు
మించినీకధో గతినిగల్పించుచుండె
కర్షకా! నెటికైనను కనులు దెఱచి
సరభసంబున నింటికిమరలుమోయి

ప్రకృతిరామణీ యకమైనపల్లెటూరి
కాపురమొనీకు పరమసుఖప్రదంబు
కృషిక జీవనమది యెంయేనిప్రియము
కర్షకా! లెమ్ము పల్లెకుకదలిపొమ్ము

ప్రకృతిశోభరహించు వనములందెరుగక
    క్లబ్బులలోకూడ జీట్లాడమరగి
కర్షకత్వముసేద్య గాండ్రకువీడి, యు
      ద్యోగుల వెనువెంట నేగమమరగి
కమ్మని యంబలి గంజి ద్రావుట రోసి
     బ్రాందిసీసాల సేవనముమరగి

పురజనావళి యార్యోగమునుగడింప
బల్లెలకు నెగ చుండగా బ్రదుకువిడిచి
పురములకు బ్రాకులాడదు పరువువీడి
కర్షకా! లెమ్ము పల్లెకుగదలిపొమ్ము