పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మున్నట్లు పాశ్చాత్యులే యంగీకరించి యున్నారు. అశోకుడు తన శాసనములు తెలుగులోనే వ్ర్రాయించే నేమో! నన్నయకు పూర్వ గ్రంధములు ఏమైనవి? మనదేశము ఆఱవ శతాబ్దమునకు పూర్వము బౌద్ధజైనక్రాంతమై యుండినపుడు ఆంధ్రమున బౌద్ధజైన వాజ్మయములు విస్తరిల్లి యుండవచ్చును. తరువాత రాజ్యాదికారులైన చాళుక్యులు బ్రాహ్మణ మతస్థుల వారు బౌద్ధజైన వాజ్మయము లను ప్రోత్సహింపక పొవుటయే కాక రాజరాజనరేందుని కాలమున వారి మతవాజ్మయాభి వృద్దికై, అప్పటికె సన్నగిల్లి పోయిన బౌద్ధజైన వాజ్మయము లను అడుగంట నాశనమొనర్చి నన్నయను భారత ఆంధ్రీకారమునకు ప్రొత్స హించి యుందురు.

ఒక్కొక్క కాలమునందు ప్రబలిన ఆచారములు, ఆలోచనలును వాజ్మయము యొక్క విధానములను నిర్ణయించుచుండును. జాతీయ జీవనమున కలుగు మార్పుల కనుగుణముగా నొక్కొక్కప్పుడు కవిత యందలి రుచియు మాఱు చుండును. కావున నొక్కొక్క విధమైన కావ్యము ప్రాముఖ్యములోనికి వచ్చుచుండును..

ప్రస్తుతాంధ్ర వాజ్మయమున ప్రధమ యుగము ఆంధ్రీకరణ యుగము. నన్నయాదులు కేవల భాషాంతరీకరణ మొనర్చక ఆంధ్రీకారమున పెక్కు మార్పులు కల్పించిరి.

ప్రబంధములందు కవులొక చిన్నకధను తీసికొని పెంచి పెద్దకావ్యముగా జేయుటకు మొదలిడిరి. నాచన సోమనాధుడు ఉత్తరహరివంశముతోడను శ్రీనాధుడు శృంగారనైషధము తోడను, ఆంధ్ర వాజ్మయ్హమున ప్రబంధ బీజములు చల్లిరి. క్రమముగా అల్లసానిపెద్దన తన మను చరిత్రముతో ప్రబంధరాజము నంకురింపజేసెను. తరువాత రామరాజభూషణుడు తన వసుచరిత్రమున కొన్ని క్రొత్తపోకడలు పోయెను పిమ్మట పింగళి సూరనార్యుడు తన కళాపూర్ణోదయము ప్రభావతీ ప్రద్యుమ్నములతో ప్రబంధ శిఖాగ్రముల నెక్కెను.

ఆంధ్రవచన కావ్యములు మిక్కిలి ప్రాచీనకాలమునుండి వాడుకలో నున్నవనియు అవి కూడ పద్యకావ్యములవలె దీర్ఘ సమాసాలంకారములతో నింపి వేయబడి యున్నందున ఆదరణ పాత్రములు కాలేదనియు పండితోత్త ములు అభిప్రాయ పడుచున్నారు. మనకు లభించు ప్రాచీన వచనకావ్య