పుట:Telugu Samasyalu 1953.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



 

  • వంకాయను జెఱకుసరసము వడియుచునుండెన్.


క. పంకజముఖ గురుకుచములఁ
బొంకముగా గురియొనర్చి పూవిలు కాడున్
ఉంకించి శరము దొడిగిన, వంకాయను. . . 65,

  • తల కాయలపులుసు తాగి తనిసిరి బౌపల్.


క, పలుకూరి దేవళంబున
సలలితముగ మొన్నఁ జేయు సంతర్పణకుం
దొలుతను విూరంపిన చిం,
తలకాయలపులుసు. . . 66.

  • వెన్నెలయెండయుం గలసి యేకముఖంబుననుండె నత్తఱిన్,


ఉ. పన్నుగ విష్ణులు బ్రాహ్మలును పర్వత రాట్ఖగ త్రచ్చు నప్పుడున్
వెన్నుడు మోహనాకృతిని వేల్పులకున్ సుధ బోయునప్పుడున్
పన్నగ భూషుడాత్రిపుర మందిరులంబరిమార్చి నప్పుడున్ .... 67

ఉ. ముస్ను సురాసురుల్ జలధిమూకలు గట్టుకత్రచ్చునప్పడున్
వెన్నుఁడు వేూహనాకృతిని వేల్పులకున్ సుధఁబోయనప్పడున్
బన్నగభూషుఁ డాత్రిపురమందిరులంబరిమార్పినప్పడున్... 68

  • పంచాంగము చూచి లంజ పక్కున నవ్వెన్.


క, పంచమినాఁ డొకవిప్రుడు
కంచముc దా కుదువబెట్టి కామాతురుఁడై
మంఛముపై రతినేయఁగ, పం. . . 69

క, పంచశమినాఁ డొకవిప్రుఁడు
అంచితముగఁ జెట్టునెక్కి యాకులుకోయన్
కించిత్తు పంచ దొలఁగిన, పం. . . 70