పుట:Telugu Right to Information Act.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(వికలాంగులు, గాయపడిన వారి ఇచ్చే పింఛను కాకుండా) ఒకేసారి చెల్లింపు కోసం మార్పించుకున్న పెన్షను, గ్రాట్యుటీ మినహా ఇతర పదవీ విరమణ లాభాలతో సమానమైన పెన్షన్ సహా ఆ మొత్తాన్ని వేతనం నుండి మినహాయిస్తారు. రాష్ట్ర ప్రధానసమాచార కమిషనర్, సమాచార కమిషనర్ తమ నియామక సమయంలో, గతంలో కేంద్రం చట్టాలు లేక రాష్ర చట్టాల కింద ఏర్పాటైనకార్పొరేషన్లలో చేసిన సర్వీసుకూ లేక కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంలోని లేక నియంత్రణలోని ప్రభుత్వ కంపెనీలలో చేసినసర్వీసుకు పదవీ విరమణ లబ్ది పొందుతున్నట్లయితే, ఆ లబ్దికి సమానమైన పెన్షన్ మొత్తాన్ని మినహాయించి వేతనం చెల్లిస్తారు. రాష్ట్ర ప్రధానసమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల నియామకం తర్వాత వారి వేతనాలు, ఎలవెన్సులు, సర్వీసు నిబంధనలను వారికి నష్టం కలిగించే రీతిలో మార్చడం జరగదు.
(6) ఈ చట్టం కింద నిర్వహించాల్సిన కార్యాలను సమర్ధవంతంగా నిర్వహించడం కోసం అవసరమైన అధికారులనూ, ఉద్యోగులనూ రాష్ట్ర ప్రధానసమాచార కమిషనర్ కూ, సమాచార కమిషనర్ల కూ అందిస్తుంది. ఆ అధికారులకూ, ఉద్యోగులకూ చెల్లించాల్సిన వేతనాలు, ఎలవెన్సుల విషయంలో సర్వీసు నియమ నిబంధనల విషయంలో నిర్ణీతపద్ధతిలో వ్యవహరిస్తారు.

17. (1)సబ్ సెక్షన్ (3)లోని నిబంధనలకు లోబడి, రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్ ను , లేక ఏ రాష్ట్ర సమాచార కమిషనర్ నయినా నిరూపిత అనుచిత ప్రవర్తన, అశక్తత కారణాలతో ఒక్క గవర్నర్ ఉత్తర్వు ద్వారా మాత్రమే పదవి నుంచి తొలగించవచ్చు. గవర్నర్ సూచన మేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి అనుచిత ప్రవర్తన లేక అశక్తత కారణంతో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ లేక రాష్ట్ర సమాచారకమిషనర్ ను పదవి నుంచి తొలగించవచ్చని నివేదించిన తర్వాత గవర్నర్ ఆ ఉత్తర్వు జారీ చేయాలి.

(2) సబ్ సెక్షన్ (1) కింద రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్ లేక రాష్ట్ర సమాచార కమిషనర్ పై విచారణకు సుప్రీంకోర్టుకు కోరిన తర్వాత, ఆ విచారణ జరుగుతున్న సమయంలో సదరు రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్ లేక రాష్ట్ర సమాచార కమిషనర్ ను సుప్రీంకోర్టు నివేదిక అంది ఉత్తర్వు జారీ చేసేంతవరకు గవర్నర్ సస్పెండ్ చేయవచ్చు. అవసరం అనుకున్న పక్షంలో కార్యాలయంలోకి ప్రవేశించకుండా నిషేధించవచ్చు.
(3) సబ్ సెక్షన్ (1) లోని నిబంధనలతో సంబంధం లేకుండా రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్ ను లేక సమాచార కమిషనర్ ను గవర్నర్ తన ఉత్తర్వులు ద్వారా ఈ కింది కారణాలతో పదవి నుండి తొలగించవచ్చు.
(ఎ) దివాలా తీసినట్లు నిర్ణయమైనప్పుడు,
(బి) ఏదైనా నేర నిరూపణ జరిగి, ఆ నేరం నీతి బాహ్యమని గవర్నర్ భావించినప్పుడు,
(సి) పదవీకాలంలో తన విధి నిర్వహణతో సంబంధం లేని ఇతర పనులు ఆర్థిక లాభం కోసం చేసినపుడు,
(డి) శారీరకంగా లేక మానసికంగా దుర్భలులై పదవిలో కొనసాగేందుకు పనికిరాకుండా పోయారని గవర్నర్ భావించినపుడు,
(ఇ) రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్ ను లేక సమాచార కమిషనర్ తమ విధి నిర్వహణకు నష్టం చేకూర్చే అవకాశం ఉన్న ఆర్థిక ప్రయోజనాలనూ, ఇతరత్రా ప్రయోజనాలను పొందినప్పుడు.

(4) కేంద్ర ప్రభుత్వం లేక దాని తరపున చేసుకున్న ఏ ఒప్పందం, కాంట్రాక్టులోనయినా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ లేక రాష్ట్ర సమాచారకమిషనర్ అయినా ఏ తరహాలోనయినా ఆసక్తి చూపించినా, సంబంధం కల్పించుకున్నా సబ్ సెక్షన్ (1) లో పేర్కొన్న అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్లు లెక్క. ఏదయినా ఇన్ కార్పొరేటెడ్