పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునీనాం భరతాదీనా భోజాదీనాంచ భూభూజాం
శాస్త్రాణి సమ్య గాలోచ్య నాట్య వేదార్థవేవదినా
ప్రోక్తం వసంతరాజేని కుమారగిరి భూభుజా
నామ్నా వసంతరాజీయ నాట్యశాస్త్రం యదుత్తమం.

ఈ వసంత రారాజీయం మనకు ఇంతవరకూ లాభించలేదు. ఈయన ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు వాసిగా జరిపిస్తూ వుండేవాడు.

వాసిగాంచిన వసంతోత్సవాలు:

విజయనగర సామ్రాజ్యంలో, కృష్ణదేవరాయల కాలంలో, రాజధానిలో మహార్నవమి రోజున వసంత మండపంలో వసంతోత్సవాలు ఎంతటి మహా వైభవంతో జరిగేవో అలాగే వేమారెడ్డి ఆస్థానంలో కూడ జరిగేవి. ఈ సమయంలో రాజ్యం నాలుగు ప్రక్కలనుంచీ కవుల్నీ, గాయకుల్నీ , వాద్యకారుల్నీ ఆహ్వానించి, మహా వైభవంగా వసంతోత్సవం ముగించే వారు. అందుకే ఆయనకు వసంతరాయ, కర్పూర వసంతరాయ బిరుదు లీయబడ్డాయి.

ప్రతిభకు పట్టాభిషేకం, పలు దానాలు:

సంగీత సాహిత్యాలతో వినోదించే వేమారెడ్డి ప్రతిభావంతులైన కళాకారులందర్నీ తగు విధంగా సన్మానిచాడు. సంగీత సాహిత్యాల్లోనూ, భరత నాట్య శాస్త్రంలోనూ ప్రావీణ్యం కలిగిన కంచి, పొన్న , పేరి మొదలైన వారిని సన్మానించిందే కాక పేరి అనే నర్తకికి గుంటూరు జిల్లాలో వున్న పేరుకలపూడి అనే గ్రామం గ్రామాన్నే దానంగా ఇచ్చాడు.

అలాగె కంచి అనే దేవదాసిక -నాట్యగత్తెకు- కంచికచర్ల అనే గ్రామాన్ని బహూకరించాడు.

పొన్ని అనే కళాకారిణికి పొన్నవరం అనే గ్రామాన్నిచ్చి, జీవిత పర్యంతమే కాక వంశపారంపర్యంగా అనుభవించడానికి హక్కు కలిగించాడు.

ఆయన చేసిన దాన ధర్మాలను గురించీ, ఆయన విద్యాభిలాషను గూర్చి, కళాపోషణ గూర్చీ స్థానికంగా వున్న కొండవీటి చరిత్రలో