Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/771

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనంతపురం జిల్లా

పెనుగొండ:

ఒకప్పుడు విజయనగర రాజులు పరిపాలించిన ప్రదేశ మిది. ఇక్కడ నాటక దళాలతో పాటు ప్రాచీన జానపద కళారూపమైన బయలు నాటకాలు ప్రదర్శించ బడ్డాయి.


హిందూపురం:

అనంతపురం జిల్లా హిందూపూర్ తాలూకాలో ప్రతి గ్రామంలోను వీథి నాటక దళమో, తోలుబొమ్మలాట దళమో వుంది. బొమ్మలాట బృందంవారు లేపాక్షి రామాయణాన్ని, గరుడాచల యక్షగానాన్ని ప్రదర్శించేవారు.

కట్టె బొమ్మలు:

ఇక్కడ కొయ్యబొమ్మలాటలను ప్రదర్శించటం ఒక ప్రత్యేకత, ఈ బొమ్మలు ఆంధ్రదేశంలో మరెక్కడా కనిపించవు. ప్రక్క రాష్ట్రమైన కర్ణాటకలో వీటి ప్రభావం వుంది. బహుశా ఆ విధంగా ఈ కట్టె బొమ్మల కళాకారులు అటునుంచి ఇటు వచ్చి స్థిర పడి వుండవచ్చును.

ఈ కట్టె బొమ్మలు కళ్ళతోకూడ అభినయం చేయగలంతటి పనితనాన్ని నిపుణులైన గ్రామ వడ్రంగులు తయారు చేయ గలిగే వారు. అది ఖర్చుతో కూడుకున్న పని. ఈ కళారూపం చాల కాలం క్రితమే క్షీణించింది. నలభై సంవత్సరాల క్రితం కొంత మంది వద్ద విడి బొమ్మలుండేవి. అవి ఇప్పుడు వున్నాయే లేవో చెప్పలేము.