పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/745

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నామాల సింగడు రెండు కాళ్ళను, రెండు చేతుల్ని ఒక్క సారిగా కదిలిస్తూ గుంపు మధ్యలో వస్తూ వుంటాడు. వెంటనే ఒక్కసారిగా తప్పెట తిరగ మారుస్తాడు.

జెగ్ జెగ్ నకన్
జెగ్ జెగ్ నకన్
జెగ్ జెగ్ నకన్

అలా గుంపులోని స్త్రీ, పురుషులుచూస్తుండగా తప్పెట్లు వెనక్కి వెనక్కి సర్దుకుంటూ, గతులు మార్పు చేసుకుంటూ పోతారు. మూడు లేక ఐదు తప్పెటలు కొడుతూ వుంటారు. అడుగులు బిర బిరా వేసేటప్పుడు తప్పెట గతి మార్చేస్తాడు.

ఇలా తప్పెట గతులు మారుతున్నప్పుడు నామాల సింగడు కొద్దిసేపు విరామం తీసుకుంటాడు. అప్పుడు ముఖానికి అడ్డంగా గుడ్డను కప్పుతారు. అతనిపై మరమరాలు చల్లుతారు. ఎర్రనీళ్ళు దిగదీస్తూ పోతారు. ఇవన్నీ చేయటం, నామాల సింగనికి ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడాలని చేస్తారట. ఇలా గుంపు అందరికీ చూపించి ఇంటికి వెళ్తాడు. ఈ చరిత్రకు ఈ ప్రాంతంలో ఇలా ప్రచారంలో వుంది.

నామాల సింగడంటే:

నామాల సింగడనే పేరు గలిగిన వ్వక్తి ఈ ప్రాంతంలో దారి దోపిడి చేసేవాడట. సంత కెళ్ళి సరుకులు తీసుకు వస్తున్న స్త్రీ, పురుషుల్ని బలవంతంగా బట్టలు ఊడదీయించి కోలాటం వేయించేవాడట. దీనికి చుట్టూ గ్రామస్తులంతా ఏకమై అతన్ని పట్టి బంధించి గ్రామంలో తాళ్ళతో కట్టి పట్టుకుని వచ్చారట. అప్పుడు నాలుక బయటికి వచ్చి వూగుతూ కాళ్ళు తేలిపోయి అలా అలా నేలపై ఈడుస్తూ వచ్చాడట. గ్రామంలోకి వచ్చిన తరువాత చంపేశారట. దీనికి నిదర్శనం ఈ నామాల సింగని నృత్యం. ఈ నాటికీ రాయలసీమ ప్రాంతంలో మొహరం పండుగ నాడు తప్పనిసరిగా చేస్తున్నారట. సింగని వేషంలో పాల్గొనే కళాకారులు __ గొట్టూరి ఓబి రెడ్డి, చాకలి కొండన్న, హరిజన గంగప్ప, బోయిల ఆదినారాయణ, హరిజన నాగన్న మొదలైన వారని డా॥ చిగిచెర్ల కృష్ణారెడ్డిగారు వారి జానపద నృత్యకళలో పేర్కొన్నారు.