మాచల్దేవి క్రీడాభిరామం
కాకతీయుల కాలంలో వేశ్యాకులానికి విశేష ప్రాధాన్యముండేది. వేశ్యల్ని పోషించటం ఆనాటి అధికార వర్గాలు గౌరవంగా భావించేవారు. ప్రతాప రుద్రుని వుంపుడుగత్తె మాచల్దేవి భవనం ఓరుగల్లులో నాటి అత్యంత సుందర భవనాలలో ఒకటి.
- మాచల్దేవి:
మాచల్దేవి గౌరవార్థం వినుకొండ వల్లభారాయుడు క్రీడాభిరామ మనే వీథి నాటకాన్ని రచించగా అది ఓరుగల్లులో ప్రదర్శించబడింది. రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో వ్రాసిన ప్రేమాభిరామం నాటకాన్ని అనుసరించి తెలుగులో వ్రాయబడిందీ క్రీడాభిరామం. ఈ వీధినాటకాన్ని శ్రీనాథుడే వ్రాశారని కొందరు, మరి కొందరు వల్లభరాయుడే వ్రాశాడని వివాదముంది. ఎవరు వ్రాసినా 14 వ శతాబ్దంలో మొట్టమొదటగా తెలుగులో వెలువడిన వీథినాటకం ఇది. ఆ నాటి నట, విట కవులను గురించి క్రీడాభిరామం నాందీ ప్రస్తావనలో ఈ విధంగా వర్ణించబడింది.
నటులది దోరసముద్రము - విటులది యేరుగల్లు, కవిది వినుకొండ మహా
పుట భేదనమనుత్రితయము - నిటు గూర్చెను బ్రహ్మ రసికు లెల్లరు మెచ్చన్.
అని ఈ వీథినాటకాన్ని మోపూరిభైరవుని తిరునాళ్ళలో ప్రదర్శించినట్లు తెలుస్తూ వుంది.
ఆనాడు ఓరుగల్లు వుత్సవాలలో ప్రదర్శించబడిన అనేక వినోద ప్రదర్శనాలను గురించి క్రీడాభిరామంలో వివరించబడింది.
- ఏకశిలానగరంలో ఎన్నో దేవాలయాలు:
ఏక శిలానగరమని పిలువబడే ఓరుగల్లులో ఆనాడు 5500 శివాలయాలు, 1300 విష్ణు దేవాలయాలు, మైలార దేవుడు, దుర్గ, గణపతి, వీరభద్ర ఆలయాలు అదిగా వేల