పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/686

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యుద్ధం మొదలైన కథలను చెపుతూ మధ్య మధ్య రంధరంధరా మా స్వామి జన్నయ్య వంటి కొన్ని కీర్తనలు పాడుతూ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతారు. లయబద్ధంగా నృత్య చేసే ఈ బృందాలలో ఇరవై మంది వరకూ వుంటారు. ఎంత మందైనా వుండ వచ్చు. కాని వారు సమర్థులై వుండాలి. తాళం, లయ, తప్ప కుండా నృత్యం చేయగలిగి వుండాలి. క్రమం తప్పకుండా వలయాకారంగా తిరుగుతూ వీరు చేసే నృత్యం కన్నుల పండువుగా వుంటుంది.

TeluguVariJanapadaKalarupalu.djvu
యాదవుల కళారూపం:

ముఖ్యంగా ఈ కళను గొల్ల సుద్దులను ఆదరించిన యాదవులే ఈ కళనూ ఆరాధిస్తారు. ప్రదర్శన స్థాయి పెరిగే కొద్దీ ప్రదర్శకులు ప్రదర్శన మధ్యలో వారి వారి ప్రత్రిభా విశేషాలను ప్రదర్శిస్తారు. ఒకరి కంటే మరొకరు మిన్నగా రెండు భాగాలుగా చీలిపోయి పోటీలు పడతారు. ఒకరి కంటే మరొకరు తప్పెట్ల మీద వాద్య వరుసలనూ గమకాలనూ వినిపిస్తారు. ప్రదర్శనం పతాక స్థాయి చేరే సరికి సర్కసులో మాదిరి ఫీట్సుచేసే ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తారు. నిజానికి తప్పెటగుళ్ళ ప్రదర్శనానికి ఈ సర్కస్ ఫీట్సుకూ సమన్యయం వుండడు. ఉండక పోయినా ప్రేక్షకులు ఉత్కంఠతో ఈ సాహస ప్రదర్శనాన్ని చూస్తారు.

నృత్యం చేస్తూనే వలయా కారంగా తిరుగుతూనే యము తప్ప కుండానే, చిందులు త్రొక్కుతూనే ఒక ప్రక్క తప్పెటలు వాయిస్తూనే, నెమ్మదిగా ఒకరిపైన మరొకరు ఎక్కుతూ అంచెలంచెలుగా గోపురాకారంగా నిలిచినప్పుడు ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా వుంటుంది. పైవారి బరువునంతా క్రింది వారు భరిస్తూ వుంటే ప్రక్కనున్న కొద్ది మంది లయ తప్పకుండా పాటలు పాడుతూనే వుంటారు.

ఏకాగ్రతా నృత్యం:

కూచిపూడి నృత్యంలో నెత్తిన చెంబూ కాళ్ళ క్రింద పళ్ళెమూ మాదిరి వీరు కూడ నీరు నింపిన మట్టి కుండ అంచులపై ఒకరు నిలబడితే, అతనిపై మరో