పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/669

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పాడుతూ, వచనంతో కథను నడుపుతూ ఆయా రసాలకు తగిన విధంగా భజన చేస్తూ పౌరాణిక ఘట్టాలను ప్రదర్శిస్తారు.

గురుపూజ:

చెక్క భజన నేర్చుకోవాలనుకున్న యువకులందరూ చేరి ఒక గురువుని ఎన్నుకుంటారు. గురుపూజతో నృత్యాన్ని ప్రారంభిస్తారు. ప్రతి గురువూ ఒకే రకంగా ఈ చెక్క భజన విద్యను ప్రదర్శింపడు. ఎవరి విధానం వారిది. ఈ చెక్క భజన రాయలసీమలో కడప జిల్లాలో పుట్టి, ఆంధ్ర

TeluguVariJanapadaKalarupalu.djvu

దేశమంతటా వ్వాపించిందని, అందుకు నిదర్శనం గురువులు చెప్పిన మూలాలు మాత్రమేకాక, జిల్లాలో ప్రతి గ్రామంలోనూ చెక్కభజన బృందాలుడటం కూడ అందుకు నిదర్శనమనీ , అలాగే చెక్క భజనకు సంబంధించిన గేయాలు ఎన్ని వున్నాయో చెప్పటం కష్టమనీ, నేను పులివెందుల తాలూకాలోని భజన గురువుల దగ్గర సేకరించిన గేయాలు, భంగిమలు ఆధారంగా కొన్నిటిని మాత్రమే వివరించగలుగు తున్నాననీ, ఈ చెక్క భజన నృత్యాన్ని ఆమూలాగ్రంగా పరిశీలించాలంటే ఈ జన్మ చాలదనీ, ప్రతి గురువు భంగిమల్లోనూ, వైవిధ్యం వుందనీ, తెలుగు విశ్వవిద్యాలయ జానపద కళల శాఖ లెక్చరర్ డా॥ చిగిచర్ల కృష్ణారెడ్డిగారు జానపద కళారూపం చెక్కభజన అనే గ్రంథంలో సోదాహరణంగా వివరించారు.

చెక్క భజన స్వరూపం:

ముఖ్యంగా చెక్క భజనల ఇతి వృతాలు ఈ విధంగా వుంటాయి. భక్తి పాటలు, భారత, భాగవత, రామాయణాలకు చెందిన పురాణ పాటలు, నీతిని ప్రభోధించే పాటలు, వీర గాథలు, ఇతరాలు, జడకోపు విద్యల్నీ ప్రదర్శిస్తారు.

భజనల్లో, హరి భజనలు, పండరి భజనలు, శావమూళ్ళ తాళం భజనలు, డప్పుల కోలాట భజనలు, కోలాట భజనలు రకారకాలుగా వున్నాయి. దేని ప్రత్యేకత దానిదే. దేని పరికరాలు దానివే.