Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/647

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఒక్క నెల్లూరు జిల్లా నుంచే కాక, చిత్తూరు, తమిళ నాతు ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తారు. చెంగాళమ్మ దేవాలయం, మద్రాసు __ కలకత్తా ట్రంకు రోడ్ ప్రక్కనే వుంది. వచ్చి పోయే వాహనాల వారు అక్కడ ఆగి పూజలు జరిపి వెళుతూ వుంటారు. చెంగాళమ్మ మహత్తు కలిగిన దేవతగా కొలుస్తారు.

బ్రహ్మోత్సవ కార్య క్రమాలు జరిగినన్ని రోజులూ, సంగీత, నృత్య, నాటక, సాంస్కృతి కోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. విద్యుద్దీపాలతో ఆ

ప్రాంతాన్నంతా రంగు రంగుల బల్బులతో అలంకరిస్తారు. ఈ ఉత్సవంలో ఎక్కడా కనిపించని సుళ్ళు తిరిగే సిడి బండి ప్రత్యేక ఆకర్షణ.