పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/628

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రేణుకా మహాత్యం:

జమదగ్ని మహాముని ఆజ్ఞ ననుసరించి కుమారుడైన పరశురాముడు తల్లి యైన రేణుకను వధించిన తీరునూ, ఆ కథ యొక్క పూర్వాపరాలనూ, వధానంతరం రేణుక యొక్క మహాత్య గాధలనూ ఉత్తేజంగా బైండ్లవారు చెపుతారు. రేణుక చేసిన త్యాగానికి ముగ్ధులై రేణుకను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.

ఎల్లమ్మను ఆరాధించే భక్తులు, వారి ఆడపిల్లలను ఎల్లమ్మ పేరు మీద జోగితలుగా అర్పిస్తారు. ఆమెను బసివిగా పిలుస్తారు. ఆ అమ్మాయి ఊరందరి సొత్తు. ప్రతిఫలాపేక్ష లేకుండా అందరి కామ వాంఛలూ తీరుస్తుంది. ఆ సాంప్రదాయం ఈ నాటికి తెలంగాణాలో కొనసాగౌతూనే వుంది.

ఎల్లమ్మ:

ఎల్లమ్మ పుట్టు పూర్వోత్తారాలను గురించి డా॥ ఎల్దెండ రఘుమారెడ్డి "పల్లె పదాలలో ప్రజా జీవనం" అనే గ్రంధంలో ( 352 వ, పేజీలో) ఉదహరించిన జానపద గేయాన్ని బట్టి ఎల్లమ్మ జన్మ వృత్తాంతం తెలుస్తున్నదని కె.వి. హనుమంతరావుగారు ఆంధ్ర ప్రభలో ఉదహరించారు.