ఈ కళాకారులు ఒకే రాగంలో దరువు ప్రారంభించి గంటల తరబడి గంతులు వేస్తూ, హెచ్చు శృతిలో దీర్ఘకాలం దమ్ము పట్టి ఆలాపన చేయటం వలన, ఈ భాగవతాన్ని నక్కల భాగవతం అని జానపదులలో వాడుకై పోయింది.
- అందరూ ఆదరించిన కళ:
ముఖ్యంగా ఈ భాగవతాలను ప్రదర్శించే వారు కూచిపూడి బ్రాహ్మణుల మాదిరి ఒక తెగకు చెందిన వారు కారు. అన్ని కులాలకూ, వర్గాలకూ చెందిన వారున్నారు. బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, కొప్పువెలమలు, దాసర్లు, పంచములలో కూడ ఈ కళాకారు లున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన అప్పలస్వామి, అనే భాగవత కళాకారుడు పంచమ కులానికి చెందిన వాడు, ఈ భాగవతాలలో పాత్రలు ధరించే వారందరూ పురుషులే.
అయినా ఏభై సంవత్సరాల క్రితం, ఒకే ఒక స్త్రీ, భామ వేషం ధరించి, ఆనాటి ప్రజానీకాన్ని ఆశ్చర్యపర్చిందట. ఆమె "తెర్లాం" గ్రామానికి చెందిన కాలి గుంటి వెంకట స్వామి అనే భాగవత కళాకారుని కుమార్తె. గ్రామాలలో సహజంగా వుండే సెంటి మెంట్సును బట్టి ఆమె పేరు " పొయ్యిబుగ్గి" ఎనభై సంవత్సరాల వయస్సులో తినటానికి తిండి లేని దీనావస్థలో కాలం గడిపింది.
- ఎందరో కళాకారులు, ఎన్నో ప్రదర్శనాలు:
ఈనాడు విశాఖ జిల్ల శృంగవరపు కోట తాలూకా, ఖాసా పేట గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణుడు కొచ్చెర్ల బ్రహ్మం భాగవత కళాకారుడు తన కుమార్తె అంజలికి ఈ విద్యను నేర్పి, అనేక ప్రదర్శనలను ఇప్పిస్తున్నారు.
అలాగే బొంతల కోటి జగన్నాథం, దూడల శంకరయ్య, బొంతల కోటి రామమూర్తి, దూర్వాసుల మాణిక్యం, కురుమోజ రామమూర్తి అచారి ... హిమంది బోడిదాసు. భడితోక సత్యనారాయణ అచారి.... చందక వెంకటప్పారావు.... దూడల లింగ మూర్తి.... తంపెట్ల సత్యం...... కాలి గుంటం అప్పల స్వామి ...... కొచ్చర్ల బ్రహ్మం ..... చామర్తి సత్యం, కోనేటి అప్పారావు .... యర్రా సూర్య నారాయణ, అలకంసెట్టి నరసింగారావు .... యర్రా సింహాచలం, వానపల్లి పరదేశి .... మీసాల